2020 నాటి విద్యుత్ వినియోగదారుల చట్టంలో మార్పులు చేర్పులు చేసింది కేంద్రం. న్యాణ్యమైన విద్యుత్‌పై కేంద్రం కొత్త లెక్క చెప్పింది. నగరాల్లో కరెంట్ కోతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ మేరకు రాష్ట్రాల ప్రిపేర్డ్‌గా ఉండాలని చెప్పింది. మరో ఐదేళ్లలో పట్టణాల్లో జరేటర్ల ప్లేస్‌లో సంప్రదాయ విద్యుత్ వినియోగం వాడేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
దేశంలో లక్ష అంతకు మించిన జనాభా ఉన్న పట్టణాల్లో కరెంటు తీయొద్దని రోజుంతా సరఫరా ఉండాలని ఆదేశించింది. తాత్కాలిక అవసరాల కోసం ఎవరైనా విద్యుత్ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే రెండు రోజుల్లో ప్రోసెస్ చేయాలని సూచించింది. విద్యుత్ వినియోగదారుల హక్కుల నియామవళి-2020కి కొన్ని సవరణలు చేసి.. కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.
కొత్తగా సవరించిన రూల్స్ ప్రకారం... లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించాలని కేంద్రం సూచించింది. దీని వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. అసలు జనరేటర్లు వాడకుండా ఉండేలా విద్యుత్ కోతల్లేకుండా సరఫరా చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.
ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తే కచ్చితమైన టైం చెప్పాలని కేంద్రం తెలిపింది. ఒకవేళ కరెంట్ కట్ అయింతే మూడు నిమిషాల్లో సరఫరా పునరుద్దరిస్తేనే నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతున్నట్టు అభిప్రాయపడింది.
డీజిల్ జనరేటర్లకు బదులు సోలార్, విండ్ పవర్‌పై నడిచే బ్యాటరీలు వినియోగించేలా ప్లాన్ చేయాలన్నారు. ఇప్పటి నుంచి ఐదేళ్ల లోపు జనరేటర్లు వాడేవాళ్లంతా సంప్రదాయేతర ఇంధన వినియోగంలోకి మారేలా మోటివేట్ చేయాలని తెలిపింది కేంద్రం. ఆ దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని చెప్పింది.
ఎక్కడైనా తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్లు కావాలని రిక్వస్ట్‌లు వస్తే ప్రీ పెయిడ్ మీటర్లు ఫిట్ చేయాలని చెప్పింది కేంద్రం. వారు దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు కనెక్షన్ ఇవ్వాలని తెలిపింది. అక్కడ లైన్లు వేయాల్సి వచ్చినప్పుడు వారం రోజులు గడువు తీసుకోవాలని పేర్కొంది.
విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా మూడు చోట్ల జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీని కోసం రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 27న అవగాహన సదస్సు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది కేంద్రం. ఇష్టం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో పాల్గొని ఉత్పత్తి జోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది కేంద్రం. ఈ జోన్ల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని.. కొంత వరకు నిరుద్యోగ సమస్య తీసుకుందని అభిప్రాయపడింది.