Mukesh Ambani House Special Lighting: దేశంలోని ప్రజలంతా ఎదురు చూస్తున్న చరిత్రాత్మక ఘట్టం బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం. దేశ నలుమూలలోని ప్రజలంతా జనవరి 22ను గొప్ప పండుగగా జరుపుకుంటున్నారు. ప్రతి ఊరు, గ్రామం, ప్రతి వీధి, ప్రతి ఇంట్లో రామనామం మారుమోగుతోంది. ఇక అయోధ్య అయితే రంగు రంగుల పూలు, రకరకాల లైట్లు, దీపాలతో వెలిగిపోతోంది. దేశంలోని చాలా ప్రముఖ ఆలయాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా 'జై శ్రీరామ్‌' అనే ప్రత్యక దీపాలతో అలంకరించారు. ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ముఖేశ్‌ అంబానీ నివాసం ఆంటిలియా 'జైశ్రీరామ్‌' ప్రత్యేక లైటింగ్‌తో వెలిగిపోయింది. దానికి సంబంధించి వీడియోలు, ఫొటోలు నెటింట్లో వైరల్‌ అవుతున్నాయి.


స్పెషలో లైటింగ్‌


ముంబయిలోని రిలయన్స్ అధినేత ముఖేశ్‌ అంబానీ ఇల్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. కాగా.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ ఇంటికి ప్రత్యేక లైట్లు పెట్టారు. ‘జై శ్రీరామ్‌’, ప్రత్యేకంగా దీపాలు వేలాడుతున్నట్లు ఇంటిని ముస్తాబు చేశారు. ఇక ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్‌, శ్లోకా అంబానీ, అనంత్‌ రాధికా ఇప్పటికే అయోధ్య చేరుకోగా.. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాకుండా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.    






 


ఇక ఆ ఇంటితో పాటు దేశంలోని ఎన్నో బిల్డింగ్‌లకు కూడా ఈ రకంగా దీపాలతో అలంకరణ చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధికారిక నివాసాన్ని కూడా ప్రత్యేక లైట్లతో అలంకరించారు. మరోవైపు అయోధ్యను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. రకరకాల పూలతో ముస్తాబు చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం తరతరాలు మాట్లాడుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 


 






ఇక ప్రాణప్రతిష్ఠ రోజున అయోధ్య మొత్తం దీపాలతో వెలిగిపోనుంది. అయోధ్యలోని అన్ని దేవలయాల్లో దాదాపు 10 లక్షల దీపాలను వెలిగించనున్నారు. 100 ప్రధాన దేవాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో దీపాలు వెలిగించనున్నారు.యూపీలోని ప్రజలంతా వాళ్ల ఇంటిముందు, దుకాణాలు, సంస్థలు తదితర ప్రాంతాల్లో దీపాలు వెలిగించాలని యోగి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లోకల్‌ వాళ్లు తయారు చేసిన దీపాల్లో వెలిగించాలని అధికారులు చెప్పారు. జనవరి 22న అయోధ్యలో పవిత్రోత్సవం అనంతరం సాయంత్రం 10 లక్షల దీపాలతో నగరం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోనుంది. ఇక అన్ని ప్రదేశాలు రాజ్యోతితో కళకళాడుతుందని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సన్నాహకాలు పూర్తయ్యాయి. ఇక ఇదిలా ఉండగా.. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం సందర్భంగా.. దేశంలోని ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.