దేశంలోని ప్రజాప్రతినిధులపై ( MPs MLAs ) క్రిమినల్ కేసుల సత్వర విచారణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15వ తేదీ తర్వాత వాదనలు వినేందుకు అంగీకారం తెలిపింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల వ్యవహారంపై తక్షణమే వాదనలు వినాలన్న అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ పదిహేను తర్వాత వినాలని నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత వ్యాజ్యంపై తక్షణమే విచారణ జరపాలని కోరుతూ సీజేఐ ధర్మాసనం ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు విజయ్ హన్సారియా. ఆయన ఈ అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం, 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్
గతంలోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీల ద్వారా సిట్టింగ్ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు(MP) మరియు శాసనసభ్యులు(MLA)లపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించి వివరాల్ని అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు సమర్పించారు. మొత్తం 163మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు, 122మంది నేతలపై ఈడీ కేసులు ఉన్నట్టు కోర్టుకు వెల్లడించారు. విచారణను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్యూరీ నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంది. కరోనాతో పాటు వివిద కారణాల వల్ల ఆలస్యం అయింది.
బెంగళూరులో అమానవీయ ఘటన, కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన తండ్రి
ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్లో విచారణ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. మనీలాండరింగ్ కేసుల్లో 51 మంది ఎంపీలు
71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిందితులుగా ఉన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టుల్లో 163 కేసులు పెండింగ్‍లో ఉండగా.. 58 పెండింగ్ కేసుల్లో జీవతఖైదు శిక్షలు విధించతగినవి 45 కేసుల్లో అభియోగాలు కూడా నమోదు కాలేదని అప్పట్లో అమికస్ క్యూరీ నివేదించారు. ఇప్పుడు మళ్లీ అమికస్ క్యూరీనే కోరడంతో పదిహేనో తేదీ తర్వాత ప్రత్యేక విచారణ చేపట్టనున్నారు.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లోనూ ఓ ప్రత్యేక కోర్టు ప్రజాప్రతినిధులపై ఉన్నకేసుల విచారణ జరుపుతోంది. ఆ కోర్టులో ఎన్నికల సందర్భంగా నమదైన పలు కేసులపై తీర్పులు కూడా వచ్చాయి. కొన్ని క్రిమినల్ కేసుల్లోనూ తీర్పులు వచ్చాయి. అయితే ఇంకా విచారణ ఆలస్యం అవుతోంది., ఈ సందంర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.