1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో మరణించిన సైనికులకు గుర్తుగా దిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర జవాను జ్యోతిని ఏర్పాటు చేశారు. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతోన్న ఈ జ్యోతి నేడు ఆరోపోనుంది. దీన్ని జాతీయ యుద్ధ సార్మకం వద్ద ఉన్న జ్యోతితో కలపనున్నారు. అయితే ఈ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశభక్తిని, త్యాగాన్ని కొంతమంది అర్థం చేసుకోలేరంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
అయితే విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వ వర్గాలు దీనిపై వివరణ ఇచ్చాయి. జ్యోతిని ఆర్పేయడం లేదని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపేస్తున్నామని తెలిపాయి.
ఎందుకు?
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాప్ చీఫ్ ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాకృష్ణ సారథ్యంలో ఈరోజు మధ్యాహ్నం జరిగే కార్యక్రమంలో అమర జవాను జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో కలపనున్నారు. నిర్వహణ కష్టతరం కావడం వల్ల రెండింటిని కలపాలనే నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రాహుల్ విమర్శలు..
ఈ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.
Also Read: Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. కరోనా కారణంగా 55 పాసింజర్ రైళ్లు రద్దు