దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 29,722 కేసులు ఎక్కువగా వచ్చాయి. ఒక్కరోజులో 2,51,777 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా 703 మంది కరోనా కారణంగా మృతి చెందారు.








  • యాక్టివ్ కేసులు: 20,18,825

  • డైలీ పాజిటివిటీ రేటు: 17.94%


దేశంలో ఇప్పటివరకు 9,692 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825కి చేరింది. రికవరీ రేటు 93.50%గా ఉంది.







మహారాష్ట్ర.. 


మహారాష్ట్రలో కొత్తగా 46,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. 37 మంది మృతి చెందారు. తాజాగా 52,000 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 73,71,757కి చేరింది. మృతుల సంఖ్య 1,41,971కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,58,569కి చేరింది.


Also Read: Viral Video: సీరియస్‌ డిబేట్‌లో మహిళ సిల్లీ డ్యాన్స్.. అవకాశం ఇవ్వకపోతే అంతేగా.. అంతేగా!






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి