CJI DY Chandrachud:
చాట్‌జీపీటీపై వ్యాఖ్యలు..
AI,ChatGPT టెక్నాలజీపై సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లు కష్టమైన పనులనూ సింపుల్‌గా చేసేస్తున్నాయని అన్నారు. జోక్స్ చెప్పడం నుంచి కోడింగ్ వరకూ అన్నీ ఈ టెక్నాలజీతో సులభతరమైపోయాయని వెల్లడించారు. ఐఐటీ మద్రాస్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ టెక్నాలజీతో లీగల్ సబ్జెక్ట్‌లనూ సులువుగా రాసే వెసులుబాటు వచ్చిందని తెలిపారు. హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో కూడా గమనించాలని సూచించారు.
"ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కెపాసిటీ ఈ టెక్నాలజీతో ఎంతో పెరిగిపోయింది. ఇదే సమయంలో చాట్‌జీపీటీ వినియోగమూ పెరిగింది. చిన్న చిన్న జోక్స్ నుంచి కోడింగ్ లాంటి అతి కష్టమైన విషయాలనూ ఈ టెక్నాలజీ చాలా సింప్లిఫై చేసింది. లీగల్ టాపిక్స్‌ని కూడా సులభంగా రాసే వెసులుబాటునిచ్చింది"
- డీవై చంద్రచూడ్, సీజేఐ
త్వరలోనే సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేయడంలో AI టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు చెప్పారు. ట్రయల్ బేసిస్‌లో దీన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.
"ట్రయల్ బేసిస్‌లో సుప్రీంకోర్టులోనూ AI టెక్నాలజీ వినియోగిస్తున్నాం. ప్రొసీడింగ్స్‌ని స్ట్రీమింగ్ చేసేందుకు వాడుతున్నాం. ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. మానవ అభివృద్ధిలో ఈ టెక్నాలజీ ఏ మేర ఉపయోగపడుతుందన్నది గమనించాలి. దీన్ని దుర్వినియోగం చేసే వాళ్లూ ఉంటారు. ప్రజల్లో ఆ భయం కలిగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఈ ఆందోళన మొదలైతే ఎవరూ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోలేరు. మానవ విలువలతో పాటు వ్యక్తిగత గోప్యత చాలా అవసరం. టెక్నాలజీ కారణంగా ఇవి మిస్‌యూజ్ అవ్వకూడదు. ఆన్‌లైన్ వేధింపులు, బెదిరింపులు కూడా పెరిగే ప్రమాదముంది. "
- డీవై చంద్రచూడ్, సీజేఐ
స్పెషల్ కోర్స్...
కేంద్రప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇండియా 2.0 లో భాగంగా ఉచిత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-AI కోర్సును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. స్కిల్ ఇండియా, జీయూవీఐ మధ్య పరస్పర సహకారంతో ఈ కార్యక్రమానికి రూపొందించారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, మరాఠీ, గుజరాతీ, హిందీతోపాటు ఇంగ్లిష్‌లో ఈ కోర్సును అందుబాటులో తీసుకొచ్చారు. ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కోర్సును ప్రారంభిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన ఉంటుంది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీఈటీ)', ఐఐటీ మద్రాస్ గుర్తింపు కూడా దక్కించుకుంది. ఐఐటీ మద్రాస్, ఐఐఎం అహ్మదాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ జీయూవీ.. పర్సనలైజ్డ్ లెర్నింగ్ సొల్యూషన్స్ విభాగాల్లో అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీ వివిధ ప్రాంతీయ భాషల్లో సాంకేతిక నైపుణ్యాలను బోధించడం, ఆన్‌లైన్ లెర్నింగ్, అప్‌స్కిల్లింగ్, రిక్రూట్‌మెంట్ అవకాశాల వంటి సేవలను అందిస్తోంది.