DGP Brothers : దేశ పోలీసు వ్య‌వ‌స్థ‌(Country police system)లో సంచ‌ల‌నం నమోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఒకే కుటుంబంలోని ఐపీఎస్‌(IPS)లుగా ఎంపికైన విష‌యం తెలిసిందే. వేర్వేరు రాష్ట్రాల్లో ఐపీఎస్‌లుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌వారు కూడా ఉన్నారు. మ‌న ఏపీ(AP)లోనూ ఐపీఎస్‌ భార్యా భ‌ర్త‌లు(అనురాధ‌(Anuradha), సురేంద్ర‌బాబు(Surendrababu) ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. కానీ, ఇప్పుడు ఒకే కుటుంబంలోని అన్న‌ద‌మ్ములు ఏకంగా రెండు రాష్ట్రాల‌కు పోలీసు బాసులుగా(DGP) ప‌నిచేస్తుండ‌డం మాత్రం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి. దీంతో వీరి విష‌యం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఐపీఎస్​లు అవ్వడం సాధ‌ర‌ణ‌మే అయినా.. వారు రెండు రాష్ట్రాలకు డీజీపీలుగా నియమితులు కావ‌డం ఆస‌క్తిగా మారింది. దేశ పోలీస్ శాఖ చరిత్రలోనే ఇలా జరగడం ఇది తొలిసారి. ఇద్దరిలో ఒకరు ఏడాది కాలంగా డీజీపీ పని చేస్తున్నారు. మరొకరు తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు డీజీపీగా బాధ్య‌త‌లు చేపట్టారు.


ఇద్ద‌రూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు!


ప్ర‌స్తుతం ఆస‌క్తిగా మారిన ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కూడా ఒకే రాష్ట్రం బిహార్‌కు చెందిన వారు. బిహార్​కు చెందిన సహాయ్​ కుటుంబంలో మొత్తం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. వివేక్ సహాయ్(Viveksahay) 1988 బ్యాచ్​, వికాస్ సహాయ్(Vikas sahay) 1989 బ్యాచ్ ఐపీఎస్​ అధికారులు. విక్రమ్ సహాయ్(Vikram sahay) 1992 బ్యాచ్ ఐఆర్​ఎస్ అధికారి. గతేడాది కాలంగా గుజరాత్ కి వికాస్ సహాయ్ డీజీపీగా ఉన్నారు. అయితే ఈయ‌న సోద‌రుడు వివేక్ స‌హాయ్‌​  సోమ‌వారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌తో ప‌శ్చిమ‌ బంగాల్​ రాష్ట్ర‌ డీజీపీగా నియమితులయ్యారు. ఎన్నికలో షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత బెంగాల్ డీజీపీని కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌స్పెండ్ చేసింది. దీనికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఖాళీ అయిన  బంగాల్​ డీజీపీ పదవికి ముగ్గురు పేర్లను ఎన్నికల సంఘానికి పంపారు. వారిలో వివేక్ సహాయ్​ను బంగాల్​ డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్నదమ్ములిద్దరూ రెండు వేర్వేరు రాష్ట్రాలకు డీజీపీలుగా అయ్యారు.  


ఎక్క‌డ నుంచి ఎక్క‌డివ‌ర‌కు.. 


బిహార్‌(Bihar)లో జ‌న్మించిన వివేక్‌, వికాస్‌లు.. ఒక‌రు గుజ‌రాత్‌కు, మ‌రొక‌రు ప‌శ్చిమ బెంగాల్‌(West bangal)కు డీజీపీలు కావ‌డంతో బిహార్‌లో అధికారులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. వివేక్ సహాయ్ బంగాల్​ కేడర్​కు చెందిన 1988 బ్యాచ్​ ఐపీఎస్ అధికారి. గతంలో డీజీ, డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ హోమ్​ గార్డ్​గా పనిచేశారు. 2021లో బంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata benerji) సెక్యూరిటీకి ఇన్​ఛార్జ్​గా ఉన్నారు. వివేక్ సెక్యూరిటీ ఇన్​ఛార్జ్​గా విఫలమయ్యాడని ఆ సంవత్సరమే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. మళ్లీ 2023లో డీజీగా బాధ్యతలు అప్పగించారు. ఇక వికాస్ సహాయ్ విషయానికొస్తే 1989 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. 1999లో గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు ఎస్పీగా నియ‌మితుల‌య్యారు. 2001లో అహ్మదాబాద్​లో రూరల్‌లో ఎస్పీగా పనిచేశారు. 2002లో అహ్మదాబాద్‌లోనే జోన్ 2,3కి డీసీపీగా నియమితులయ్యారు. 2004లో ట్రాఫిక్ డీసీపీ, 2005లో అహ్మదాబాద్‌లో అదనపు ట్రాఫిక్ సీపీ. ఆ తర్వాత 2007లో సూరత్‌లో అదనపు సీపీగా నియమితులయ్యారు. 2008లో జాయింట్ సీపీ సూరత్‌గా, 2009లో ఐజీ (సెక్యూరిటీ), 2010లో ఐజీ (సీఐడీ)గా పనిచేశారు. 2023లో గుజరాత్​కు డీజీపీగా నిమమితులయ్యారు. మొత్తంగా ఇద్ద‌రూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డం.. అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు లేకుండా పోవ‌డం వంటివి విశేషం. అంతేకాదు.. వీరికి రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌లు కూడా క‌డుదూరం. కేవ‌లం స‌ర్వీస్ రూల్స్‌ను పాటిస్తూ.. అన‌తికాలంలోనే గుర్తింపు పొందారు.