How To Change Polling Station In Voter Id : దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల(General Elections 2024) వేడి ర‌గులుకుంది. మొత్తంగా 99 కోట్ల మంది ఓటర్లు త‌మ ఓటు హ‌క్కు(Right of Vote) ను వినియోగించుకోనున్నారు. భార‌త్ వంటి అతి పెద్ద ప్ర‌జాస్వామ్యంలో ఓటర్ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. పైగా ఈ ఏడాది జ‌రుగుతున్న ఎన్నిక‌లు అతి పెద్ద‌వ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. దేశానికి(India) స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల చ‌రిత్ర‌లో అతి ఎక్కువ సంఖ్య‌లో ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించు కునే అవ‌కాశం ఇప్పుడే వ‌చ్చింద‌ని తెలిపింది. ప్ర‌తి ఐదేళ్ల‌కు(Every Five years) ఒక‌సారి సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతున్నా.. గ‌డిచిన ఐదేళ్ల‌లో దేశంలో జ‌నాభాతోపాటు.. ఓటు హ‌క్కు పొందిన వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. 72 ఏళ్ల చ‌రిత్ర‌లో కంటే ఈ ఏడాది జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో యువ ఓట‌ర్ల సంఖ్య‌గా ఎక్కువ‌గా ఉండ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని పేర్కొంది. దీంతో ఓటు హ‌క్కు వినియోగంపై విస్తృతంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Election commission) అధికారులు ప్ర‌చారం చేస్తున్నారు. ఇదే స‌మయంలో ఓట‌ర్ల‌కు ఉన్న అనేక సందేహాల‌కు, స‌మ‌స్య‌ల‌కు కూడా ప‌రిష్కారాలు చూపిస్తున్నారు. వీటిలో కీల‌క‌మైన రెండున్నాయి. 1) ఓటు వేసే పోలింగ్ కేంద్రాన్ని మార్చుకోవ‌చ్చా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. 2) ఓట‌రు కార్డులో అడ్ర‌స్‌, పేరు(అంటే ఇంటిపేరు), డోర్ నెంబ‌రు, ఇత‌ర‌త్రా అంశాల‌ను మార్చుకునే అవ‌కాశం ఉందా? అనేది రెండోది. ఈ రెండు అంశాల‌పైనా తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం వివ‌ర‌ణ ఇచ్చింది. అదేవిధంగా `సీ-ఓట‌ర్‌` పేరుతో ప్ర‌త్యేక మొబైల్ అప్లికేష‌న్‌ను కూడా అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. దీనిలో ఓట‌ర్లు.. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించి.. అధికారుల నుంచి 48 గంట‌ల్లో స‌మాధానాలు పొందేందుకు అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, పై రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చూద్దాం.. 


1) పోలింగ్ కేంద్రం మార్చుకోవ‌చ్చా?


సాధార‌ణంగా ఓట‌ర్లు.. త‌మ హ‌క్కును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే.. కొన్ని కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తుంది. వీటి కోసం దాదాపు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌(Schools)నే ఎంచుకుంటారు. ఇవి అందుబాటులో లేని చోట మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయంగా రెవెన్యూ కార్యాల‌యాల‌ను.. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే.. నాలుగు చోట్ల ఈసారి పోలీసు స్టేష‌న్ల‌నే పోలింగ్ కేంద్రాలుగా మార్చారు. దీనికి ప్రధాన కార‌ణం.. భ‌ద్ర‌త స‌మ‌స్య‌లు రాకుండా ఉండ‌డ‌మే. ఓట‌ర్ల‌తో ఓట్లు వేయించ‌డ‌మే కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌నికాదు. ఈ ప్ర‌క్రియ‌ను ఎంత క‌ట్టుదిట్టంగా నిర్వ‌హించారో.. అంతే భ‌ద్రంగా ఓట్ల‌ను జాగ్ర‌త్త ప‌ర‌చాలి. అసాంఘిక శ‌క్తులు, అల్ల‌రి మూక‌ల నుంచి ఓట్ల‌ను ర‌క్షించ‌డం కూడా ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌ర్త‌వ్యం. ఈ క్ర‌మంలో పోలింగ్ కేంద్రాల‌కు అత్య‌ధిక భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తారు. అదేవిధంగా వాటిని ఎంపిక చేసుకునేప్పుడే జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇలా ఒకసారి పోలింగ్ కేంద్రం ఎంపిక చేసిన త‌ర్వాత‌.. దాదాపు వాటిని మార్చే అవ‌కాశం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక కుటుంబంలో నాలుగు ఓట్లు ఉన్నాయ‌నుకుంటే.. ఈ న‌లుగురికి ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చు.. లేదా క‌ల్పించ‌క‌పోనూ వ‌చ్చు. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. ఓటు వేసే సంఖ్య‌ను బ‌ట్టి ఆధార‌పై.. రిట‌ర్నింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్ల‌ను ఎంపిక చేస్తారు. ఒక పోలింగ్ కేంద్రంలో గ‌రిష్ఠంగా 20 వేల మందికి మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలో పోలింగ్ కేంద్రాలు మారుతుంటాయి. ఇవి మాకు దూరంగా ఉన్నాయ‌ని కానీ.. మార్చాల‌ని కానీ కోరుకునే వారు.. ఎన్నిక‌ల పోలింగ్‌కు.. మూడు మాసాల ముందు రిట‌ర్నింగ్ అధికారికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే.. వీలును బ‌ట్టి మార్చే అవ‌కాశం మాత్ర‌మే ఉంటుంది... త‌ప్ప‌.. వారిని ఆదేశించ‌లేరు. సో.. పోలింగ్ కేంద్రం మార్పు ఓట‌ర్ల చేతిలో లేని అంశం. 


2) ఓట‌రు కార్డులో మార్పులు


ఇది సాధార‌ణంగా అంద‌రికీ వ‌చ్చే స‌మ‌స్యే. ఓట‌రు గుర్తింపు కార్డుల్లో పేర్లు త‌ప్పులుగా ప‌డ‌డం, లేదా మ‌హిళ‌ల‌కైతే.. వివాహాల అనంత‌రం ఇంటి పేర్లు మారుతుండ‌డం.. వ‌య‌సు నిర్ధార‌ణ మారుతుండ‌డం.. ఇంటి అడ్ర‌స్‌లు మారుతుండ‌డం స‌హజం. మ‌రి వీటిని మార్చుకునే అవ‌కాశం ఉందా?  అంటే.. ఉంది. అది కూడా ఎక్క‌డ‌కీ వెళ్ల‌కుండానే ఓట‌ర్లు త‌మ ఇంటి నుంచి లేదా ఆన్‌లైన్ సెంట‌ర్ నుంచి మార్చుకునే అవ‌కాశం ఉంది. వ‌య‌సు నిర్ధార‌ణ కోసం... జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను, ఇంటి అడ్ర‌స్ మార్పు కోసం.. క‌రెంటు బిల్లు, లేదా గ్యాస్ బిల్లు, లేదా నివ‌సిస్తున్న ఇంటి య‌జ‌మాని ఇచ్చిన అధీకృత నోట‌రీ ప‌త్రం వంటివాటిని ఆన్‌లైన్ అప్‌లేడి.. ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్‌లో మార్చుకోవ‌చ్చు. ఒక‌సారి వీటిని అప్‌లోడ్ చేసి.. నిర్ణీత మార్పుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తును పూర్తి చేసిన 24 గంట‌ల్లోనే ఆన్‌లైన్‌లోనే మార్పులు క‌నిపిస్తాయి. దీనిని డౌన్ లోడ్ చేసుకునే వెసులు బాటు ఎన్నిక‌ల సంఘం క‌ల్పించింది. ఇదీ.. సంగతి!!