Verity Doctor Fee : అదో ఆస్పత్రి. అక్కడ చార్జీల వివరాలను కూడా రాశారు. తానే చూసి.. తానే ట్రీట్ మెంట్ ఇస్తే రూ. రెండు వందలు తీసుకుంటానని ఆ డాక్టర్ బోర్డు పెట్టారు. ఆ ఒక్కటే కాదు.. రూ. రెండు వేల రూపాయల ఖరీదైన వైద్యం కూడా ఆయన దగ్గర అందుబాటులో ఉంది. అదేమిటంటే.. తన క్లీనిక్‌కు వచ్చి తన వ్యాధేంటో తానే ఖరారు చేసుకుని తానే ట్రీట్‌మెంట్ చేసుకునే పేషంట్లు రూ. రెండు వేలు చెల్లించాలని స్పష్టం చేశారు. అది మాత్రమే కాదు..మొత్తం ఐదు రకాల ట్రీట్ మెంట్స్ ఆ డాక్టర్ అందుబాటులోకి తెచ్చారు. వాటిని మీరే చూడండి.
ఇలా ఆ డాక్టర్ ( Doctor ) పెట్టడానికి కారణం ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఏ అనారోగ్యం వచ్చినా ముందుగా గూగుల్‌లో చెక్ చేసుకుని సొంత వైద్యం చేసుకోవడం ఇప్పుడు అలవాటైపోయింది. అయితే చాలా మంది అలా చూసుకుని.. చేసుకోని తగ్గలేదని వైద్యుల వద్దకు వస్తూంటారు. ఇలా వచ్చి డాక్టర్లను సతాయిస్తూ ఉంటారు. గూగుల్‌లో అలా ఉంది.. గూగుల్‌లో ఇలా ఉంది. తాము రోగానికి ఆ వైద్యం తీసుకుంటాం... ఈ వైద్యం ( Treatment ) తీసుకుంటామని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన ఆ డాక్టర్.. అలాంటి వారికి వేరే చార్జీలు ఫిక్స్ చేశాడన్నమాట.
ఈ ట్రీట్‌మెంట్ చార్జీల చార్జ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది డాక్టర్‌కు సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
అయితే ఇంతకీ ఈ డాక్టర్ ఎక్కడి వారు.. ఏ ఆస్పత్రి అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ అందులో నిజం ఉండటం... ఫన్ కూడా ఉండటంతో విపరీతంగా వైరల్ అవుతోంది.