Woman Dies: 


నోయిడాలో ఘటన..


నోయిడాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ వైర్ తెగి ఒక్కసారిగా అదుపు తప్పింది. 8వ అంతస్తు నుంచి ఉన్నట్టుండి కిందకు జారి మధ్యలో ఆగిపోయింది. ఈ ప్రమాద సమయంలో 73 ఏళ్ల మహిళ ఆ లిఫ్ట్‌లోనే ఉంది. అకస్మాత్తుగా కుదుపులకు గురి కావడం వల్ల ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. లిఫ్ట్‌లో ఆమె మాత్రమే ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 


"నోయిడాలోని సెక్టార్ 137లో పరాస్ టియెర్రా సొసైటీలో లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. వైర్ తెగిపోవడం వల్ల కుదుపులకు లోనైంది. ఉన్నట్టుండి జారిపోయి రెండు అంతస్తుల మధ్య చిక్కుకుపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఉన్న మహిళ స్పృహ తప్పి పడోపియంది. ఆ సమయంలో ఆమె ఒక్కతే ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించినా లాభం లేకుండా పోయింది. గుండెపోటుతో ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. ఈ ప్రమాదం జరిగిన గంట తరవాత ఆమె ప్రాణాలు కోల్పోయారు. వెనక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. తలకూ దెబ్బవలు తగిలాయి. బహుశా ఉన్నట్టుండి లిఫ్ట్ పడిపోవడం వల్ల ఈ గాయాలై ఉండొచ్చు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి పల్స్ లేదు."


- పోలీసులు


ఈ ఘటన తరవాత వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అంటూ ప్రశ్నించారు. వెంటనే లిఫ్ట్ బాగు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మధ్యే ముంబయి లోయర్ పరేల్ ప్రాంతంలోని కమలా మిల్స్ కాంపౌండ్ లో ఉన్న ట్రేడ్ వరల్డ్ బిల్డింగ్ లో లిఫ్ట్ కుప్పకూలింది. నాలుగో అంతస్తు వద్ద ఉన్నప్పుడు ఒక్కసారిగా కుప్పకూలి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయింది. ఈ ఘటనలో 12 నుంచి 14 మందికి గాయాలయ్యాయి. 


టీచర్ మృతి..


కొన్ని రోజుల క్రితం ముంబయిలో లిఫ్ట్ డోరులో ఇరుక్కుని ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ముంబయిలోని శివారు ప్రాంతం అయిన మలాడ్ చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. జెనెల్ ఫెర్నాండెజ్ అనే 26 ఏళ్ల టీచర్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. లిఫ్ట్ లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ బటన్ నొక్కగానే లిఫ్ట్ తను ఉన్న ఫ్లోర్ కు వచ్చి ఆగింది. ఎప్పట్లాగే ఆమె లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ లోని స్టాఫ్ రూమ్ కు వెళ్లాలనుకుంది. కానీ అనుకోని ప్రమాదం ఆమె ప్రాణాలను తీసింది. ఆమె లిఫ్ట్ లోకి పూర్తిగా వెళ్లక ముందే లిఫ్ట్ తలుపు ఆటోమేటిక్ గా మూసున్నాయి. అంతలోనే లిఫ్ట్ కిందకు వెళ్లింది. అలా జెనెలె ఫెర్నాండెజ్ లిఫ్ట్ తలుపుల మధ్యలోనే అలాగే ఉండిపోగా.. పాఠశాల సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. పరుగెత్తుకు వచ్చి లిఫ్ఠ్ డోర్ మధ్యలో ఇరుక్కున్న జెనెలె ఫెర్నాండెజ్ ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ టీచర్ తీవ్రంగా గాయాలపాలైంది 


Also Read: Uttarakhand Rains: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడి 10 మంది గల్లంతు