Houseboat Fire Accident: 



అగ్ని ప్రమాదం..


శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో (Dal Lake) ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హౌజ్‌బోట్‌లో (Houseboat Fire Accident) జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు బంగ్లాదేశ్ టూరిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన హౌజ్‌బోట్ నుంచి పక్కనే మరి కొన్ని పడవలకూ మంటలు వ్యాపించాయి. అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మంటలకు పడి ముగ్గురు బంగ్లాదేశ్ టూరిస్ట్‌లు ఆహుతి అయ్యారు. దాల్‌లేక్‌లోని ఘాట్ నంబర్ 9 వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో కనీసం 5 హౌజ్‌బోట్స్‌ దగ్ధమయ్యాయి. అయితే...ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనేది ఇంకా తెలియలేదు. 






ఈ ప్రమాదంపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కీలక వివరాలు వెల్లడించారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినట్టు చెప్పారు.


"తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగింది. మాకు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చాం. ఈ మంటలకు 5-8 హౌజ్‌బోట్స్ కాలిపోయాయి. ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. అదే కనుక్కునే పనిలో ఉన్నాం. వెంటనే రెస్క్యూ ఆపరేషన్‌ మొదలు పెట్టాం. అందుకే పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. 5 హౌజ్‌బోట్స్‌తో దగ్ధమయ్యాయి. టూరిస్ట్‌లను కాపాడాం"


- ఫరూక్ అహ్మద్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్