26/11 Mumbai Attack: చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంది. పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేసేందుకు చేసిన ప్రతిపాదనలను డ్రాగన్ దేశం అడ్డుకుంది. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మిర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయాలని భారత్ తో పాటు అమెరికా ప్రతిపాదనలు చేశాయి. 1267 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా బ్లాక్ చేసింది. సాజిద్ మిర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే.. అతడి ఆస్తులను జప్తు చేస్తారు. అలాగే విదేశీ ప్రయాణాలకు అనుమతించరు. గత సెప్టెంబరు లో కూడా భారత్ చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది.


26/11 ముంబై ఉగ్రదాడుల్లో సాజిద్ మిర్ కీలకం


26/11 ముంబై ఉగ్రదాడుల్లో సాజిద్ మిర్ కీలకంగా వ్యవహరించాడు. అలా భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో జాబితాలో సాజిద్ మిర్ కూడా ఉన్నాడు. అతడి తలపై 50 లక్షల డాలర్ల బహుమతి కుడా ఉంది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో పాకిస్థాన్ లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు.. సాజిద్ మిర్ కు 15 ఏళ్లకు పైగా జైలు శిక్షణ విధించింది. దీంతో సాజిద్ మిర్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇంతకు ముందు సాజిద్ మిర్ మరణించాడని పాకిస్థాన్ వాదించగా.. ఏ దేశం కూడా ఆ ప్రకటనను నమ్మలేదు. దీంతో ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశాయి.


Also Read: Viral Video: హైవే సైన్‌బోర్డ్‌పై పుషప్స్, మద్యం మత్తులో ఓ యువకుడి స్టంట్ - వైరల్ వీడియో


గ్రేలిస్టు నుంచి బయటపడేందుకు పాక్ ఎత్తుగడ!


ఒక పక్క భారత్, అమెరికా సాజిద్ మిర్ కోసం గాలింపు చేస్తోంటే.. పాక్ మాత్రం సాజిద్ చనిపోయినట్లు కట్టు కథ అల్లింది. సాజిద్ మిర్ చనిపోయినట్లు ఆధారాలు చూపించాలని అమెరికా గట్టిగా అగడంతో ప్లేటు ఫిరాయించింది. సాజిద్ మిర్ కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు ప్రకటించింది. గత ఏడాది జూన్ లో, పారిస్ కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాసక్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు గాను పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని చెప్పేందుకు ఈ ఎత్తుగడ వేసింది. ఇదిలా ఉండగా సాజిద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాటెండ్ లిస్టులో చేర్చేందుకు భారత్, అమెరికా కలిసి ఒక ప్రతిపాదన సిద్ధం చేశాయి. ఉగ్రవాదుల్ని కాపాడే విషయంలో చైనా, పాక్ రెండు దేశాలు కూడా ఒకటే ధోరణితో వ్యవహరిస్తున్నాయని, సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఇటు వంటి వ్యక్తులను మనం నిషేధించలకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రమూకలను అణచి వేయడం కష్టమని ఐక్యరాజ్యసమితి MEA జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గుప్తా చెప్పుకొచ్చారు. 






Join Us on Telegram: https://t.me/abpdesamofficial