Meghalaya High Court:


పోక్సో కేసు విచారణ..


ఓ పోక్సో కేసుని విచారించే క్రమంలో మేఘాలయ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 16 ఏళ్ల బాలిక తన ఫిజికల్ రిలేషన్‌షిప్‌ గురించి నిర్ణయం తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. ఈ వయసులో శారీరకంగా, మానసికంగా అమ్మాయిలు ఎదుగుతారని, తను ఎవరితో రిలేషన్‌లో ఉండాలో నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారని వివరించింది. 2021లో దాఖలైన లైంగిక వేధింపుల కేసు విచారించిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు. ఆ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇద్దరి అంగీకారంతోనే ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఓ పిటిషన్ దాఖలు కాగా..దీనిపైనా విచారణ చేపట్టింది న్యాయస్థానం. బాధితురాలితో పాటు, నిందితుడు అని భావిస్తున్న యువకుడు చాలా రోజులుగా రిలేషన్‌లో ఉన్నారు. తనపై ఉన్న పోక్సో కేసుని రద్దు చేయాలని పిటిషన్ పెట్టుకున్నాడు యువకుడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన కోర్టు...లైంగిక వేధింపుల కేసుని రద్దు చేసింది. ఇద్దరి అంగీకారంతో కలిసి ఉన్నప్పుడు అవి వేధింపుల పరిధిలోకి రావని తెలిపింది. 


"16 ఏళ్లు వచ్చాక ఆ అమ్మాయి మానసికంగా, శారీరకంగా తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వస్తుంది. ఇది సరైన వయసే అని కోర్టు భావిస్తోంది. ముఖ్యంగా ఫిజికల్ రిలేషన్‌షిప్స్‌లో తను ఎవరితో అలా కలిసి ఉండాలో నిర్ణయించుకునే తెలివి, సామర్థ్యం ఆ వయసుకి వచ్చేస్తాయి"


- మేఘాలయా కోర్టు


కేసు రద్దు..


వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసి అమ్మాయి తల్లి ఆ యువకుడిపై పోక్సో కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ కేసు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. దీన్ని సవాలు చేస్తూ యువకుడు పిటిషన్ వేశాడు. అటు అమ్మాయి కూడా యువకుడికే మద్దతుగా నిలిచింది. "నేను ఆ అబ్బాయి గర్ల్‌ఫ్రెండ్‌నే" అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇద్దరం ఫిజికల్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆ విషయంలో ఎవరూ తనను బలవంతం చేయలేదని ఆ అమ్మాయి అంగీకరించింది. ఇద్దరి తరపు వాదనలు విన్న తరవాత కోర్టు పోక్సో కేసుని రద్దు చేసింది. 


కర్ణాటక హైకోర్టు తీర్పు..


కర్ణాటక హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఆమెకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. పిటిషనర్‌కి అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కోర్టుని ఆశ్రయించింది. అయితే...కోర్టు మాత్రం ఆమె పిటిషన్‌ని తిరస్కరించింది. తనపై నమోదు చేసిన పిటిషన్‌ని కొట్టేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్న వ్యక్తికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఎమ్‌ నాగప్రసన్నతో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ దీనిపై విచారణ జరిపింది. 


"ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పిటిషనర్ వాదిస్తున్నారు. కంప్లెయింట్ ఆధారంగా చూస్తే...ఆమెకి అప్పటికే పెళ్లైంది. ఓ కూతురు కూడా ఉంది. ఆమెకి ఇప్పటికే పెళ్లైనప్పుడు మరో వ్యక్తి పెళ్లి చేసుకోలేదని పిటిషన్‌ వేయడంలో అర్థం ఏముంది..? ఆ వ్యక్తి మోసం చేశాడనడం సరికాదు. అందుకే ఈ పిటిషన్‌ని పరిగణించడం లేదు"


- కోర్టు ధర్మాసనం 


Also Read: పొరపాటున ఓ అకౌంట్‌కి బదులు మరో అకౌంట్‌కి డబ్బులు పంపారా, ఇదిగో సొల్యూషన్