NSA-Level Meet:'అఫ్గాన్'పై కీలక భేటీకి ఒప్పు కున్న రష్యా.. తప్పుకున్న పాక్.. కిక్కురుమనని చైనా!

ABP Desam   |  Murali Krishna   |  05 Nov 2021 08:03 PM (IST)

అఫ్గానిస్థాన్ అంశంపై చర్చించేందుకు భారత్ నేతృత్వంలో కీలక సమావేశం జరగనుంది.

'అఫ్గాన్'పై కీలక భేటీకి ఒప్పు కున్న రష్యా.. తప్పుకున్న పాక్.. కిక్కురుమనని చైనా!

అఫ్గానిస్థాన్‌ అంశంపై చర్చించేందుకు భారత్ నేతృత్వంలో నవంబర్ 10న ఓ భద్రతా సమావేశం జరగనుంది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) స్థాయిలో ఈ చర్చ జరగనున్నట్లు సమాచారం.

ఈ చర్చలో పాల్గొనేందుకు భారత్.. రష్యా, ఇరాన్, చైనా, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారులను అధికారికంగా ఆహ్వానించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ డోభాల్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భారత్ ఆహ్వానాన్ని పలు దేశాలు పాజిటివ్‌గా స్పందించాయి. రష్యా, ఇరాన్ సహా పలు దేశాలు సమావేశానికి హాజరుకానున్నట్లు స్పష్టం చేశాయి. 

అయితే భారత్ నేతృత్వం వహిస్తోన్న కారణంగా ఈ సమావేశానికి హాజరుకాబోమని పాకిస్థాన్ తెలిపింది.

పాకిస్థాన్ నిర్ణయం దురదృష్టకరం. అయితే ఆశ్చర్యం ఏం లేదు. అఫ్గానిస్థాన్‌ను పాక్ ఏ దృష్టితో చూస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సమావేశాలకు పాక్ ఇంతకుముందు హాజరుకాలేదు. అఫ్గానిస్థాన్‌లో పాక్ చేస్తోన్న కుట్రలు బయటపడకుండా దేశ మీడియాతో భారత్‌పై నిందలు వేయిస్తుంది                                                - విశ్వసనీయ అధికారుల సమాచారం

పాకిస్థాన్‌ను పక్కన పెడితే చైనా ఇంకా భారత్ ఆహ్వానంపై స్పందించలేదు. ఇలాంటి ప్రాంతీయ భద్రతా సమావేశాలు 2018 సెప్టెంబర్, 2019 డిసెంబర్‌లో జరిగాయి. భారత్‌లో జరగాల్సిన ఈ సమావేశం కరోనా కారణంగా జరగలేదు.

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రాంతీయ భద్రత దెబ్బతింటుందని సరిహద్దు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
 
Also Read: Mumbai Cruise Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి వాంఖడే ఔట్
 

Also Read: Navjot Singh Sidhu Resignation: పీసీసీ చీఫ్‌గా సిద్ధూ కొనసాగింపు.. రాజీనామా ఉపసంహరణ

Published at: 05 Nov 2021 08:02 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.