ABP  WhatsApp

PM Modi on ASEAN-India Summit: 2022ను 'ఏషియన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్‌'గా ప్రకటించిన మోదీ

ABP Desam Updated at: 28 Oct 2021 02:46 PM (IST)
Edited By: Murali Krishna

ప్రధాని నరేంద్ర మోదీ.. 18వ ఏషియన్- ఇండియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సంక్షోభం వల్ల ఎదుర్కొన్న సవాళ్ల గురించి తన ప్రసంగంలో మాట్లాడారు.

2022ను 'ఏషియన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్‌'గా ప్రకటించిన మోదీ

NEXT PREV

18వ ఏషియన్- ఇండియా సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రపంచం ఎదుర్కొన్న సవాళ్లు, పరస్పర సహకారంతో మహమ్మారిపై చేసిన పోరాటం గురించి మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 






కరోనా మహమ్మారి వల్ల మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏషియన్-ఇండియా స్నేహానికి కూడా ఇది ఓ పరీక్షలాంటింది. కానీ కరోనా సంక్షోభంలో వల్ల మన సంబంధాలు మరింత బలోపేతమయ్యాయి. 



2022 నాటికి మన భాగస్వామ్యానికి 30 ఏళ్లు నిండుతాయి. భారత్​ కూడా 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ మైలురాయికి గుర్తుగా వచ్చే ఏడాదిని ఏషియన్​-ఇండియా​ ఐక్యత సంవత్సరంగా జరుపుకుందాం.                              - ప్రధాని నరేంద్ర మోదీ


కొవిడ్ 19తో పాటు ఆసియా- భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆరోగ్యం, వాణిజ్యం, సంబంధాలు, విద్య, సాంస్కృతిక రంగాల్లో పురోగతిపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించారు. ప్రాంతీయ పరిస్థితుల నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ ఏషియన్-ఇండియా సదస్సు మోదీ హాజరైన తొమ్మిదో సదస్సు. ప్రతి ఏడాది ఈ సదస్సు జరుగుతుంది. 


తూర్పు ఆసియా సదస్సు..


ఈ నెల అక్టోబర్ 27న జరిగిన తూర్పు ఆసియా సదస్సులో కూడా మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. 2005 నుంచి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. 10 ఆసియా సభ్య దేశాలతో పాటు భారత్, చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యా కూడా ఇందులో సభ్యులుగా ఉన్నాయి.


Also Read: NEET Result 2021: నీట్ పరీక్ష ఫలితాల విడుదలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్


Also Read: Cruise Chip Drugs Case: ముంబయి డ్రగ్స్ కేసు అప్‌డేట్.. కీలక సాక్షి గోసవీ అరెస్ట్


Also Read: Air Pollution Reduces Sperm Count: వాయు కాలుష్యం వల్ల ఆ కౌంట్ తగ్గిపోతుందట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


Also Read: T20 WC, Ind vs NZ: న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్న టాప్-5 ప్లేయర్లు వీరే!


Also Read: IND Vs NZ: రెండు జట్లకు ఫైనల్ లాంటి మ్యాచ్.. ఓడిన జట్టు దాదాపు ఇంటికే.. ఎందుకంటే?


Also Read: T20 WC Ind vs Pak: కోహ్లీసేనకు హార్దిక్‌ పాండ్యే ఎదరుదెబ్బ! అతడిని ఆడించడమే కోహ్లీ తప్పన్న ఇంజమామ్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి


 

Published at: 28 Oct 2021 02:42 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.