Goalie Amrinder Singh: 'దయచేసి నన్ను వదిలేయండ్రా బాబూ'.. మీడియాకు అమరీందర్ సింగ్ విజ్ఞప్తి!

ABP Desam Updated at: 30 Sep 2021 05:48 PM (IST)
Edited By: Murali Krishna

పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఆయనకు బదులు వేరే అమరీందర్ సింగ్‌ను నెటిజన్లు ట్యాగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్‌లో అమరీందర్ సింగ్

NEXT PREV

పంజాబ్‌లో ఓవైపు గంట గంటకు రాజకీయ ఉత్కంఠ పెరిగిపోతుంటే మరోవైపు ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర ఘటన వైరల్ అవుతోంది. భారత ఫుట్‌బాల్ గోల్-కీపర్ అమరీందర్ సింగ్.. మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌కు పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రిప్లై ఇవ్వడమే అసలైన ట్విస్ట్.


అసలేమైంది?


అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో ట్విట్టర్‌లో చాలా మంది పంజాబ్ మాజీ సీఎంను ట్యాగ్ చేయబోయి ఫుట్‌బాలర్ అమరీందర్ సింగ్‌ను ట్యాగ్ చేశారు. ఫుట్‌బాలర్ అమరీందర్ సింగ్ ప్రస్తుతం మోహున్ బాగన్ జట్టుకు ఆడుతున్నాడు. ఇండియా అండర్-23 జట్టుకు కెప్టెన్‌గా కుడా చేశాడు. ఇండియన్ సీనియర్ టీమ్‌ తరఫున 7 మ్యాచ్‌లు ఆడాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో ముంబయి సిటీ, ఏటీకే మోహున్ బాగన్ తరఫున ఆడుతున్నాడు.   







న్యూస్ మీడియా, జర్నలిస్టులకు నా విజ్ఞప్తి. నేను అమరీందర్ సింగ్.. ఇండియన్ ఫుట్‌బాల్ జట్టుకు గోల్‌కీపర్‌ను.. నేను పంజాబ్ మాజీ సీఎం కాదు. దయచేసి నన్ను ట్యాగ్ చేయకండి.                          -  అమరీందర్ సింగ్, ఫుట్‌బాల్ ఆటగాడు 


మాజీ సీఎం రిప్లై..


ఫుట్‌బాలర్ చేసిన ట్వీట్‌కు మాజీ సీఎం అమరీందర్ సింగ్ రిప్లై ఇచ్చారు. 



నీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.. నా ఫ్రెండ్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.                        -     కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ సీఎం 






Also Read: ISIS Terrorist: కబాబ్ మార్చిన కథ.. ఏకంగా ఐసిస్ ఉగ్రవాదినే పట్టించేసింది!


Also Read: Punjab Congress crisis: రసవత్తరంగా పంజాబ్ రాజకీయం.. కాంగ్రెస్‌కు అమరీందర్ సింగ్ బైబై!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి




Published at: 30 Sep 2021 05:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.