Corona Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 16,866 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మృతి చెందారు. తాజాగా కొవిడ్ నుంచి 18,148 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.46 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు : 4,39,05,641
- మొత్తం మరణాలు: 5,26,074
- యాక్టివ్ కేసులు: 1,50,877
- మొత్తం రికవరీలు: 4,32,28,670
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 16,82,390 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 202.17 కోట్లు దాటింది. మరో 2,39,751 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Droupadi Murmu President of India: నా ఎన్నిక దేశ ప్రజల విశ్వాసానికి ప్రతీక: రాష్ట్రపతి తొలి ప్రసంగం
Also Read: President Oath Ceremony: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం