Lithium in India: నో డౌట్ భారత్ భవిష్యత్‌కు ఇక తిరుగే లేదు, లిథియం రిజర్వ్‌లపై ఆనంద్ మహీంద్రా ట్వీట్

Lithium in India: జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు లభించడంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

Continues below advertisement

Lithium in India:

Continues below advertisement

జమ్ముకశ్మీర్‌లో లిథియం నిల్వలు..

జమ్ముకశ్మీర్‌లో టన్నుల కొద్ది లిథియం నిల్వలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇకపై లిథియం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహీంద్ర గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఇక భవిష్యత్‌లో భారత్‌ పవర్‌ఫుల్‌గా ఎదుగుతుందంటూ ట్వీట్ చేశారు. 

"ఇంక అనుమానమేమీ లేదు. భారత్ భవిష్యత్ శక్తిమంతంగా ఉండనుంది" 

-ఆనంద్ మహీంద్రా

భారీ నిల్వలు..

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఇటీవలే జమ్ముకశ్మీర్‌లోని సలాల్ హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వల్ని కనుగొంది. దేశంలో ఇలా నిల్వలు బయట పడటం ఇదే తొలిసారి.  =బ్యాటరీల తయారీలో కీలకమైన "లిథియం" కోసం భారత్ చైనా, ఆస్ట్రేలియా దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. వీటిని దిగుమతి చేసుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఈ వ్యయం తగ్గించుకునేందుకు భారత్‌లోనే లిథియం నిల్వలు ఉన్నాయా లేదా అని సర్వే చేసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI). జమ్ముకశ్మీర్‌లో భారీ రిజర్వ్‌లు ఉన్నట్టు గుర్తించింది. రీసీ జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి 650 కిలోమీటర్ల దూరంలో ఈ నిల్వలను కనుగొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 51 రకాల మినరల్ బ్లాక్‌లను గుర్తించగా...అందులో లిథియం బ్లాక్ ఒకటి. కొన్ని చోట్ల గోల్డ్ బ్లాక్‌లనూ కనుగొన్న GSI..వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఈ 51 మినరల్ బ్లాక్‌లలో 5 బంగారానివే. మిగతావి జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటకలో ఉన్నాయి. వీటిలో పొటాష్, మాలిబ్డెనమ్ ఖనిజాలను కనుగొన్నారు. 2018-19 మధ్య కాలంలో చేసిన సర్వేలో ఇవి వెలుగులోకి వచ్చాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ 7,897 టన్నుల బొగ్గు నిల్వల్ని కనుగొంది. దాదాపు 115 ప్రాజెక్టుల ద్వారా GSI నిత్యం ఆయా ఖనిజాల నిల్వల్ని వెలికి తీస్తూ ఉంది. 

ఇక సులువు..

విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది కేంద్రం. అయితే...ఈ వెహికిల్స్‌కి అవసరమైన బ్యాటరీలు తయారు చేయాలంటే లిథియం కచ్చితంగా అవసరం. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా లిథియంను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశాలు చైనా, ఆస్ట్రేలియా. 
భారత్ కూడా వీటిపైనే ఆధార పడుతోంది. ప్రధాన నగరాలన్నింటిలోనూ విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచాలన్న లక్ష్యానికి లిథియం కొరత అడ్డంకింగా మారింది. అందుకే...GSI చాలా రోజుల పాటు సర్వే చేపట్టి జమ్ముకశ్మీర్‌లో ఈ నిల్వలను కనుగొంది. ఫలితంగా...ఇకపై భారత్ బ్యాటరీల తయారీ కోసం వేరే దేశాలపై ఆధారపడే పరిస్థితి మారుతుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్‌లోకి కొత్త విద్యుత్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో కన్నా వీటి విక్రయాలూ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో లిథియం నిల్వలు వెలుగులోకి రావడం సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. 

Also Read: Turkey Earthquake: 94 గంటల పాటు శిథిలాల కిందే, బతకడం కోసం తన మూత్రం తానే తాగాడు

Continues below advertisement
Sponsored Links by Taboola