Air Asia Fined:
రూ.20 లక్షల ఫైన్
ఎయిర్ ఏషియా కంపెనీకి DGCA షాక్ ఇచ్చింది. పైలట్‌లకు సరైన విధంగా శిక్షణ ఇవ్వలేదని రూ.20 లక్షల జరిమానా విధించింది. పైలట్‌లకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఎక్సర్‌సైజ్‌లను నిర్లక్ష్యం చేశారని మండి పడింది. పైలట్ ప్రొఫీషియెన్సీ చెక్, ఇన్‌స్ట్రుమెంట్ చెక్ లాంటివి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. అంతే కాదు. ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌నీ సస్పెండ్ చేసింది. మూడు నెలల పాటు విధుల్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. మొత్తం ట్రైనింగ్ టీమ్‌లో ఉన్న ఎగ్జామినర్లకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల ఫైన్ వేసింది. వీటితో పాటు షో కాజ్ నోటీసులు కూడా పంపింది. రూల్స్ ఎందుకు పాటించలేదో వివరించాలని ఆదేశించింది. రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని చెప్పింది. వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనుంది DGCA. ఇప్పటికే తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా...DGCA అన్ని సంస్థలపైనా ప్రత్యేక నిఘా పెడుతోంది. ఏ చిన్న లోపం ఉందని తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే Air Asiaను మందలించి జరిమానా వేసింది.