Pahalgam Terror Attack : జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడితో యావత్ దేశం ఆగ్రహంతో ఊగిపోతోంది. పహల్గాంలోని బైసరన్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన ఘటన భారతీయుల రక్తం మరిగేలా చేస్తోంది. ఈ దుర్ఘటనలో 26 మంది మృతి చెందారు. లష్కర్-ఎ-తైయబా (ఎల్‌ఈటీ) శాఖ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ హత్యాకాండకు బాధ్యత వహించింది. అటువంటి పరిస్థితుల్లో ఈ దాడికి మాస్టర్‌మైండ్ ఎవరు? టీఆర్‌ఎఫ్‌కు నాయకత్వం ఎవరు వహిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇండియా టుడే నివేదిక ప్రకారం, పహల్గాం దాడికి మాస్టర్‌మైండ్ లష్కర్ గ్రూప్‌నకు చెందిన సైఫుల్లా కసూరి అని, టీఆర్‌ఎఫ్ సమూహానికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఇచ్చే ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019న రద్దు చేశారు. అప్పటి నుంచి ఉగ్రవాద కార్యకలాపాలతోపాటు రాళ్ల దాడి ఘటనల్లో తగ్గుదల కనిపించింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఏర్పాటు అయింది.
టీఆర్‌ఎఫ్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?టీఆర్‌ఎఫ్‌కు సైఫుల్లా కసూరి నాయకత్వం వహిస్తున్నాడు. పాకిస్థానీ ఉగ్రవాద సమూహం లష్కర్-ఎ-తైయబా (ఎల్‌ఈటీ) సీనియర్ కమాండర్ సైఫుల్లా కసూరి, లేదా ఖాలిద్ ఈ పహల్గాం దాడికి మాస్టర్‌మైండ్ అని చెబుతున్నారు. కసూరిని ఎల్‌ఈటీ స్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహిత సహచరుడిగా కూడా భావిస్తున్నారు. ఈ దాడి జాగ్రత్తగా ప్లాన్ చేసినట్టు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులు సైలెంట్‌గా ఉంటూ భారీ ప్రాణనష్టం కలిగించడానికి సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇద్దరు వీఐపీలు కీలకమైన పర్యటనలో ఉన్న టైంలోనే దాడి జరిగింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నారు. అదే టైంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు.
ఎల్‌ఈటీలో ఖాలిద్ పాత్ర ఏమిటి?టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో అమెరికన్ ట్రెజరీని ఉటంకిస్తూ, సైఫుల్లా కసూరి లేదా ఖాలిద్‌ను హఫీజ్ సయీద్ జమాత్-ఉద్-దావా (జేయూడీ) రాజకీయ విభాగం, మిల్లి ముస్లిం లీగ్ (ఎమ్‌ఎమ్‌ఎల్) అధ్యక్షుడిగా చేశారని, 8 ఆగస్టు 2017న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పార్టీ ఏర్పాటు, లక్ష్యాలు, ఉద్దేశాల గురించి మాట్లాడారని తెలిపింది.
ఖాలిద్ (ఎల్‌ఈటీ) పెషావర్ ప్రధాన కార్యాలయం ముఖ్యుడు. జేయూడీ ఆధ్వర్యంలో మధ్య పంజాబ్ ప్రాంతానికి సమన్వయ కమిటీలో పనిచేశాడు. జేయూడీని ఏప్రిల్ 2016లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 13224 ప్రకారం అమెరికన్ విదేశాంగ శాఖ ఎల్‌ఈటీ ఉపశాఖగా పేర్కొంది. డిసెంబర్ 2008లో దీనిని ఎల్‌ఈటీకి చెందినశాఖగా ఐక్యరాజ్యసమితి 1267/1988 నిషేధ జాబితాలో చేర్చింది.
టీఆర్‌ఎఫ్ అంటే ఏమిటి?ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ని 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటు చేశారు. నిషేధంలో ఉన్న లష్కర్-ఎ-తైయబా శాఖ. అధికారుల సమాచారం, మతపరమైన ముద్రపడకుండా ఉంటూ కశ్మీర్ ఉగ్రవాదాన్ని లోకలైజ్ చేయడానికి ఈ పేరు ఎంచుకున్నారు. 'రెసిస్టెన్స్' అనే పదం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించడానికి చేర్చారని అధికారులు అంటున్నారు.
లోయలోని జర్నలిస్టులనుకూడా టీఆర్‌ఎఫ్ బెదిరించింది. ఇలా పలు ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనడంతో దీన్ని కేంద్ర హోంశాఖ అక్రమ కార్యకలాపాలు (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఆ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, టీఆర్‌ఎఫ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా యువతను ఉగ్రవాద కార్యకలాపాలకు నియమించుకుంటోంది. ఇందులో ఉగ్రవాదుల చొరబాటు, పాకిస్థాన్ నుంచి జమ్మూ-కశ్మీర్‌కు ఆయుధాలు, మత్తుపదార్థాల అక్రమంగా తరలించడంలో సహయాపడుతోంది.
2019లో టీఆర్‌ఎఫ్ స్థాపించినప్పుడు షేక్ సజ్జాద్ గుల్ టాప్ కమాండర్‌గా ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించాడు. అయితే బాసిత్ అహ్మద్ డార్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా పనిచేశాడు. టీఆర్‌ఎఫ్ హిజ్బుల్ ముజాహిదీన్ , లష్కర్ వంటి అనేక సంస్థల ఉగ్రవాదుల మిశ్రమ సంస్థగా చెబుతున్నారు.
జమ్మూ-కశ్మీర్‌లో పౌరులు, భద్రతా దళాలపై జరిగిన చాలా దాడులను ది రెసిస్టెన్స్ ఫోర్స్ (టీఆర్‌ఎఫ్) చేసింది. ఇందులో గందర్‌బాల్ దాడి కూడా ఉంది. అక్టోబర్ 2024లో శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఒక సొరంగ నిర్మాణ ప్రదేశాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు ఒక డాక్టర్, ఆరుగురు స్థానికేతర కార్మికులు మరణించారు. జమ్మూ-కశ్మీర్ పోలీసుల ప్రకారం, 2022లో లోయలో ఈ సంస్థకు చెందిన వారినే ఎక్కువమందిని అదుపులోకి తీసుకున్నారు. లష్కర్-ఎ-తైయబా అత్యంత క్రియాశీల ప్రాక్సీల్లో టీఆర్‌ఎఫ్ ఒకటి అని చెబుతున్నారు.
పహల్గాం ఉగ్రవాద దాడికి నాయకత్వం ఎవరు వహించారు?పహల్గాం హత్యాకాండ జరిగిన గంటల్లోనే దాడికి బాధ్యతను రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) వహించింది. జమ్మూ-కశ్మీర్ పోలీసులు హత్యాకాండలో పాల్గొన్న ముగ్గురు దాడి చేసిన వారి స్కెచ్‌లను విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫూజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. దీనికి ఆసిఫ్ ఫౌజీ నాయకత్వం వహించినట్టు జాతీయ మీడియా చెబుతోంది. కొన్ని నివేదికలు అతను స్థానిక ఉగ్రవాది అని చెప్పగా, మరికొన్ని అతను పాకిస్థానీ సైన్యంతో పనిచేస్తున్నాడని, అందుకే అతని పేరు ఫౌజీ అని పేర్కొన్నాయి. చూసినవారు ఇద్దరు ఉగ్రవాదులు పష్తోలో మాట్లాడుతున్నారని చెప్పారు, ఇది పాకిస్థానీ మూలాన్ని సూచిస్తుంది, అయితే వారిలో ఇద్దరు బిజ్‌భేరా, త్రాల్‌కు చెందిన స్థానికులు అని తెలిసింది.చొరబడి లోయలోకి ప్రవేశించారు
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిని నలుగురు నుంచి ఐదుగురు పాకిస్థానీ ఉగ్రవాద ముఠా చేసిందని చెబుతున్నారు. రహస్య నివేదికల ప్రకారం, పర్యాటకులపై దాడికి కొన్ని రోజుల ముందు వారు లోయలోకి చొరబడ్డారు. పాకిస్థాన్, దాని మద్దతు, నిధులతో ఉగ్రవాదులు దశాబ్దాలుగా జమ్మూ-కశ్మీర్‌లో భయాందోళనలను సృష్టిస్తున్నారు. లష్కర్-ఎ-తైయబా, జైష్-ఎ-మహమ్మద్ (జేఈఎం), దాని ఉగ్రవాద నాయకుడు అందరూ పాకిస్థాన్‌కు చెందినవారు. కశ్మీర్‌లో చివరి పెద్ద ఉగ్రవాద దాడి ఫిబ్రవరి 2019లో జరిగింది. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. దీనిలో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు అమరులయ్యారు. భారతదేశం బాలకోట్‌లో ఎల్‌వోసీని దాటి వైమానిక దాడి చేసి ప్రతీకారం తీసుకుంది.