దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో రోజూ మూడు లక్షలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 18,75,533 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 3,33,533 మందికి కోవిడ్ వైరస్ సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 17.22% నుంచి 17.78% పెరిగింది. పాజిటివిటీ రేటు పెరుగుదల ఆందోళన కలిస్తుంది. కరోనా వైరస్ కారణగా మరో 525 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారి 3.89 కోట్ల మందికి సోకగా... 4,89,409 మంది మరణించారు. 







Also Read: ఎత్తుతోనే ఆత్మవిశ్వాసం... మంచి ఎత్తు పెరగాలంటే పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే


దేశంలో ఇంకా 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో 2,59,168 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ 3,65,60,650 కోట్ల మంది కరోనా నుంచి కోలుకోన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. దేశంలో రికవరీ రేటు 93.18 శాతానికి చేరింది. భారత్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా 71.10 లక్షల మందికి  కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. వీటితో కలిసి ఇప్పటి వరకు 1,61,92,84,270 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 15 నుంచి 18 ఏళ్ల టీనెజర్లు 4,15,77,103 మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు వేశారు. అలాగే 80,10,256 మందికి ప్రికాషనరీ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. 


మహారాష్ట్రలో 


మహారాష్ట్రలో కోవిడ్ కల్లోలం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 46,393 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 416 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. తాజాగా కోవిడ్ బారినపడి 48 మంది మరణించారు. శనివారంతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య మహారాష్ట్రలో స్వల్పంగా తగ్గింది. ముంబయిలో కొత్తగా 3,568 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొత్త కేసుల సంఖ్యలో 28 శాతం తగ్గాయి. 


కేరళ, దిల్లీలో 


కేరళలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది. కొత్తగా 45,136 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలు దాటింది. కొత్తగా 30,744 కరోనా కేసులు రికార్డయ్యాయి. గత వారం రోజులుగా దిల్లీలో కేసులు తగ్గాయి. అయితే ఆదివారం కేసులు మళ్లీ పెరిగాయి. శనివారంతో పోలిస్తే కేసుల సంఖ్య 11,486కు చేరింది. మరో 45 మంది మరణించారు. దిల్లీలో పాజిటివిటీ రేటు మాత్రం 21.48% నుంచి 16.36% తగ్గింది. 


Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో