దేశంలో  రోజువారీ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 18 వేలకు పైగా కొవిడ్ కేసులు, 200కు పైగా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం తాజా గణాంకాలను వెల్లడించింది. బుధవారం దేశంలో 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 18,987 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్నతో పోల్చితే కేసుల్లో 19.99 శాతం పెరుగుదల కనిపించింది. తాజాగా 19,808 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 3.40 కోట్ల మందికిపైగా కరోనా సోకింది. వారిలో 3.33 కోట్ల మంది కరోనా కోలుకున్నారు. రికవరీ రేటు 98.07 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 2.06 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో 246 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,51,435 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిన్న 35.66 లక్షల మందికి కోవిడ్ టీకా వేశారు. ఇప్పటి వరకు 96.82 కోట్ల  డోసులు పంపిణీ చేశారు.


Also Read:  రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు 






మూడో వేవ్ అవకాశం.. కాస్త జాగ్రత్త


పండగ సీజన్‌ కావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఇప్పటి వరకు అదుపులో ఉన్న వైరస్‌ పండగ సీజన్‌ తర్వాత విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కరోనా తగ్గింది కదా అని నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.


Also Read: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు


Also read: ఇలాంటి వారికి కరోనా సోకితే మరణించే అవకాశాలు ఎక్కువ... తేల్చిన కొత్త అధ్యయనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి