India China Clash:


పార్లమెంట్‌లో ములాయం ప్రసంగం...


తవాంగ్‌లో భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. రెండు దేశాల మధ్య ఉన్న వైరాన్ని ఇంకాస్త పెంచింది. ఈ ఘటనపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పార్లమెంట్‌ వేదికగా వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే... దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ ఒకప్పుడు పార్లమెంట్‌లో భారత్-చైనా  సరిహద్దు వివాదంపై మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను రక్షణ మంత్రిగా పని చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండేవో వివరించారు. "మన కన్నా బలహీనంగా ఉన్నామని
అనుకుంటే చైనా వెనక్కి తగ్గుతుంది. కాస్త బలం పెరిగిందంటే చాలు మళ్లీ ముందుకొచ్చి కయ్యానికి కాలు దువ్వుతుంది. భారత్‌ శత్రు దేశం అని అది చైనా గట్టిగా నమ్ముతోంది. ఈ మాటలు గుర్తు పెట్టుకోండి" అని ప్రసంగించారు. చైనా వైఖరి ఎలా ఉంటుందో వివరించారు. "నేను కూడా రక్షణమంత్రిగా పని చేశాను. చైనా ఎలాంటిదో చాలా దగ్గర నుంచి పరిశీలించాను. ఆ దేశ వైఖరేంటో అర్థం చేసుకున్నాను. అప్పట్లో ఓ సారి ఆ దేశ సైనికులు మన భూభాగంలోకి కిలోమీటర్ మేర చొచ్చుకుని వచ్చారు. మన సైనికులు వాళ్ల భూభాగంలోకి నాలుగు కిలోమీటర్లు దూసుకుపోయారు. అందుకు పూర్తి మద్దతునిచ్చాను" అని చెప్పారు. భారత సైన్య బలాన్ని తక్కువగా అంచనా వేయొద్దని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక బలగం భారత్‌దేనని స్పష్టం చేశారు. "చైనాతో జాగ్రత్త" అని హెచ్చరించారు. ఏదో విధంగా ఆ దేశం భారత్‌కు సమస్యలు తెచ్చి పెడుతూనే ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 






శశి థరూర్ కామెంట్స్‌..


కాంగ్రెస్ సీనియర్ లీడర్ శశి థరూర్ ఈ పరిణామాలపై స్పందించారు. చైనా విషయంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వ్యవహరించిన తీరుని గుర్తు  చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. "1962లో చైనాతో యుద్ధం జరిగిన సయయంలో పార్లమెంట్‌లోని అందరి సభ్యులతో మాట్లాడారు. సభ సజావుగా సాగేలా చూశారు. అందరి మాటా విన్నారు. దాదాపు 100 మంది ఎంపీలు ఆయనతో చర్చించారు. ఆ తరవాతే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు అవసరం అని ఆయన అప్పట్లోనే చెప్పారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌పై దాడి చేయడమే పనిగా పెట్టుకుంటోంది. నెహ్రూ చైనా విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉన్నారని విమర్శిస్తోంది. 
యుద్ధం వల్ల అప్పట్లో భారత్ బాగా నష్టపోయిందని ఏదో సాకులు చెబుతోంది. ఈ రెండు కారణాలు చూపించి కాంగ్రెస్‌పై దాడికి దిగుతోంది" అని అసహనం వ్యక్తం చేశారు శశి థరూర్. పార్లమెంట్‌లో జవాబుదారీతనం ఉండాలని అన్నారు. 


Also Read: Chapra Hooch Tragedy: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం అలాంటి మరణాలు లేవా - బిహార్ సీఎం నితీష్ కుమార్