Saviors in Uniform :  సైన్యం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూంటేనే దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే సైన్యం విధులు బయట శత్రువులపై పోరాటం. మరి అంతర్గత శత్రువులపై పోరాటం చేసి ప్రజలకు శాంతి భద్రతలు ఎవరు కల్పిస్తారు?  సరిహద్దుల్లో సైన్యం ఎంతటి సాహసోపేతంగా పని చేస్తుందో.. అంతర్గత భద్రతను కాపాడే విషయంలో పోలీసులూ అదే విధంగా పని చేస్తారు. ఇలాంటి కొంత మంది హీరో పోలీసు అధికారుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


అస్సాం ఉక్కు మహిళ సంజూక్తా పరాశ౨ర్ !


సంజుక్తా పరాశర్ . ఈ ఐపీఎస్ అధికారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే " అస్సాం ఉక్కు మహిళ " అని చెప్పవచ్చు. ఈ పేరే ఆమెకు స్థిరపడిపోయింది. ప్రజల ప్రాణాలకు అపాయం తలపెట్టాలనుకున్న  16 మంది తిరుగుబాటుదారులను హతమార్చిన పవర్ ఫుల్ ఆఫీసర్   సంజుక్తా పరాశర్‌.   ఆమె 15 నెలల పాటు అస్సాంలో పనిచేసిన సమయంలో, ఆమె ఇతర ఉగ్రవాదులను చంపింది. వారిని పట్టుకుంది , పెద్ద ఎత్తున  మందుగుండు సామగ్రి మరియు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఆమె 2008లో మకుమ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేయడం ప్రారంభించారు. ఆమె దైర్య సాహసాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆమె కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడారు. 


మీరా చద్దా భోర్వాంకర్   


ముంబై అండర్ వరల్డ్ సిండికేట్‌ భయపడే పోలీసు అధికారిణి మీరా చద్దా భోర్వాంకర్ .  1981లో మహారాష్ట్ర కేడర్‌కు చెందిన  తొలి మహిళా IPS అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బోర్వాంకర్ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా పనిచేశారు.ముంబై అండర్ వరల్డ్‌లో గ్యాంగ్‌స్టర్ సిండికేట్‌ను అంతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.   జల్గావ్ సెక్స్ స్కాండల్, అబూ సలేం మరియు ఇతరుల అప్పగింత వంటి అనేక క్లిష్టమైన కేసులను పరిష్కరించారు. ఆమె విశిష్ట సేవలకు గానూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ మెడల్‌తో సత్కరించారు.


అశోక్ కామ్టే ! 


26/11 దాడుల్లో ప్రాణాలు లెక్క చేయకుండా ఉగ్రవాదులపై పోరాడిన పోలీసు అధికారి అశోక్ కామ్టే.  ముంబై దాడి సమయంలో అశోక్ కామ్టే తూర్పు ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఆ భయంకరమైన రాత్రి డ్యూటీలో ఉన్న ఏకైక అధికారి కామ్టే . ఆ ఘటనలోనే విజయ్ సలాస్కర్ మరియు హేమంత్ కర్కరే వంటి ఇతర ధైర్య పోలీసు అధికారులతో కలిసి కామ్టే మరణించాడు. జనవరి 26, 2009న కామ్టే తన శౌర్యశక్తికి అశోక చక్ర పురస్కారాన్ని మరణానంతరం పొందారు. కామ్టే ధైర్య సాహసాలు ముంబైని కాపాడాయి. 


హేమంత్ కర్కరే ! 


నవంబర్ 26, 2008 దాడుల్లో ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన మరో పోలీస్ ఆఫీసర్ హేమంత్ కర్కరే.   ముంబై (ATS)లో స్క్వాడ్ కమాండర్‌గా పనిచేశారు. శివాజీ టెర్మినస్ వద్ద, అజ్మల్ కసబ్  అతని ఉగ్రవాద గ్యాంగ్‌తో తలపడ్డారు.  ఉగ్రవాదుల  కాల్పులను లెక్క చేయకుండా వారిపై పోరాడారు.  కసబ్‌ను పట్ుకునే క్రమంలో తూటాలకు బలయ్యాయి.  జనవరి 26, 2009న అతని ధైర్యానికి గుర్తింపుగా అశోకచక్ర ప్రకటించారు.  


అనేక మంది పోలీసు అధికారులు తమ ప్రాణాలు ప్రజల కోసం త్యాగం చేశారు. స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకల సమయంలో వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.