లాడ్, శాండ్ విచ్, సూప్ అన్నింటిలోనూ ఇది లేనిదే రుచి రాదు. కళ్ళు మంటగా, అలిసిపోయినట్టుగా ఉండి ఇబ్బంది పెడితే చల్లదనం కోసం ఇది కావాల్సిందే. ఆరోగ్యంగా ఉండాలంటే దీన్ని కచ్చితంగా తినాల్సిందే. అది ఏమిటా అనుకుంటున్నారా? అదేనండీ కీరదోస. కొంతమంది మాత్రమే తొక్కతో సహ కీరదోస తింటారు. దాదాపు చాలామంది తొక్క తీసేస్తారు. మీరు కూడా అలానే చేస్తున్నారా? ఆగండి ఆగండి ఒక్క నిమిషం.. కీరదోసకాయ తొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే పొరపాటున కూడా మీరు ఆ పనిచేయరు.


కీరదోసకాయ తొక్కలో అనేక విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయ్. అత్యంత పోషక విలువలు ఉండే వాటిని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కళ్ల సంరక్షణ కోసం కూడా కీరదోసని ఉపయోగిస్తారు. కళ్ల కింద మచ్చలు ఉన్నా వాటిని పోగొట్టుకునేందుకు కళ్ళల్లోని వేడిని తగ్గించేందుకు కీరదోస ముక్కలను కొద్దిసేపు కంటి మీద పెట్టుకుని రిలాక్స్ అవుతారు. ఆరోగ్యపరంగాను ఇది చాలా మంచిది. మధుమేహులు తరచూ దీన్ని తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కీరదోస మాత్రమే కాదు దాని తొక్క కూడా ఉపయోగకరమే. వాటి తొక్కలు రీ సైకిల్ చేసి మొక్కలకు సహజమైన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగంటే..


కీరదోసకాయ తొక్క నీళ్ళు


ఆహ్లాదకరమైన వాతావరణం, ఇల్లు అందంగా ఉండటం కోసం దాదాపు అందరూ ఇప్పుడు మొక్కలు పెంచుకుంటూనే ఉంటున్నారు. మొక్కల పెరుగుదల వేగంగా జరిగేందుకు మీరు ఈ కీరదోసకాయ తొక్కల నీళ్ళు ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కీరదోస తొక్కలను ఒక సీసాలోకి తీసుకోవాలి. అవి మునిగేలా నీరు పోసి సీసా మూత పెట్టి 5 రోజుల పాటు అలాగే నాననివ్వాలి. తర్వాత తొక్కలు తీసి ఆ నీటిని మొక్కలకి పోస్తే చాలా మంచిది. ఈ నీటిలో మొక్కల పెరుగుదలకి అవసరమైన పాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఎటువంటి తెగుళ్ళ బారిన పడకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ప్రతి 3 వారాలకు ఒకసారి ఈ నీటిని మొక్కలకు పోస్తే మంచి ఫలితం వస్తుంది.


కీరదోసకాయ తొక్క బూడిద


ఇది మొక్కల పెరుగుదలకి ఒక మ్యాజిక్ లాగా పని చేస్తుంది. దోసకాయ తొక్కలని బాగా ఎండలో ఎండబెట్టాలి. అవి బాగా ఎండిపోయాయి అనుకున్న తర్వాత వాటిని కాల్చాలి. ఈ తొక్కలు బూడిదగా మారిపోతుంది. ఆ బూడిదను మొక్క పెరుగుతున్న మట్టిలో చల్లాలి. దీని వల్ల మొక్క పెరుగుదలకి అవసరమైన పోషకాలు వేగంగా విడుదల అవుతాయి. అప్పుడు మొక్క బాగా పెరుగుతుంది.


కీరదోసకాయ తొక్కలని నేరుగా మొక్క ఉన్న మట్టిలో గుచ్చడం కూడా చేయవచ్చు. ఇలా చెయ్యడం వల్ల చీమల బెడద ఉండదు. ఈ చీమలు మొక్కల ఆకులని తిని వాటిని దెబ్బతీస్తాయి. తొక్కలు వేయడం వల్ల చీమలు మొక్కల దగ్గరకి రాకుండా ఉంటాయి. దోసకాయలో ఉండే ఆల్కలాయిడ్ సహజమైన రసాయనంగా పని చేస్తుంది. కీటకాలను సైతం దూరంగా ఉంచుతుంది. 


Also read: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే


Also read: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే