Stock Market Closing Bell 10 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఒడుదొడుకుల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలే అందాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 9 పాయింట్ల లాభంతో 17,534 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 35 పాయింట్ల నష్టంతో 58,817 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు బలపడి 79.51 వద్ద క్లోజైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,853 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,977 వద్ద మొదలైంది. 58,583 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,984 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 35 పాయింట్ల నష్టంతో 58,817 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 17,525 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,566 వద్ద ఓపెనైంది. 17,442 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 9 పాయింట్ల లాభంతో 17,534 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 38,298 వద్ద మొదలైంది. 38,155 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,402 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 50 పాయింట్ల లాభంతో 38,287 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 30 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, టాటాస్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌ షేర్లు లాభాపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌ నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, రియాల్టీ, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఎరుపెక్కాయి.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.