Stock Market Closing Bell 08 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందాయి. టెక్నికల్‌గా సూచీలు మరింత బలంగా కనిపిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 127 పాయింట్ల లాభంతో 17,525 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 465 పాయింట్ల లాభంతో 58,853 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు నష్టపోయి 79.65 వద్ద క్లోజైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,387 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,417 వద్ద మొదలైంది. 58,266 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,934 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 465 పాయింట్ల లాభంతో 58,853 వద్ద ముగిసింది.


NSE Nifty


శుక్రవారం 17,397 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 17,401 వద్ద ఓపెనైంది. 17,359 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,548 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 127 పాయింట్ల లాభంతో 17,525 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,847 వద్ద మొదలైంది. 37,681 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,302 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 316 పాయింట్ల లాభంతో 38,237 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 34 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎన్‌టీపీసీ, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, బ్రిటానియా, అల్ట్రాటెక్‌ సెమ్‌, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు లాభపడ్డాయి.