Stock Market Closing Bell 05 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలేమీ లేనప్పటికీ కీలక స్థాయిల్ని నిలబెట్టుకున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచినా, తైవాన్‌పై చైనా ఎయిర్‌స్ట్రైక్‌ చేసినా మదుపర్లు ఆందోళన చెందలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15 పాయింట్ల లాభంతో 17,397 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 89 పాయింట్ల లాభంతో 58,387 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 23 పైసలు లాభపడి 79.24 వద్ద క్లోజైంది.


BSE Sensex


క్రితం సెషన్లో 58,298 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,421 వద్ద మొదలైంది. 58,244 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,649 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 89 పాయింట్ల లాభంతో 58,387 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 17,382 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,397 వద్ద ఓపెనైంది. 17,348 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,474 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 15 పాయింట్ల లాభంతో 17,397 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,868 వద్ద మొదలైంది. 37,779 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,150 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 165 పాయింట్ల లాభంతో 37,920 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 28 కంపెనీలు లాభాల్లో 22 నష్టాల్లో ముగిశాయి. శ్రీసెమ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఐసీఐసీఐ, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్రిటానియా, హిందాల్కో, ఐచర్‌ మోటార్స్‌, ఎం అండ్‌ ఎం, రిలయన్స్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ సూచీలు ఎగిశాయి. ఆటో, మీడియా, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.