Independence Day 2022:
జాతీయ గీతం ఆలపించిన శరణార్థులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. భారత్‌లో రకరకాల దేశాలకు చెందిన శరణార్థులు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న ఈ వీడియోను యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా ఆదివారం షేర్ చేసింది. అదే వీడియోను మహీంద్రా గ్రూప్ సీఈవో ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు. తమకు ఆశ్రయమిచ్చిన దేశానికి కృతజ్ఞతగా పలు దేశాలకు చెందిన యువత "జనగణమన" గీతాన్ని ఆలపించింది. వీరిలో అఫ్ఘానిస్థాన్, కామెరూన్, శ్రీలంక, మియన్మార్‌కు చెందిన వాళ్లున్నారు. గ్రామీ అవార్డ్ విన్నింగ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రిక్కీ రెజ్ కూడా వీరిలో ఉన్నారు. "వసుధైక కుటుంబకం" (ప్రపంచమంతా ఒకటే) అని కోట్ చేస్తూ...ట్విటర్‌లో షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశమంతా కొన్ని నెలల ముందు నుంచే ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశమంతటా స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
Also Read: Independence Day 2022: వచ్చే 25 ఏళ్లు చాలా కీలకం, పంచప్రాణాలు పెట్టాలి - ఆ ఐదు ఏంటో చెప్పిన ప్రధాని మోదీ