Light Combat Helicopter: వాయుదళంలోకి కొత్త హెలికాప్టర్లు, ఈ స్పెషల్ ఫీచర్లతో అదనపు బలం

Light Combat Helicopter: భారత వాయుదళానికి కొత్తగా లైట్ కంబాట్ హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి.

Continues below advertisement

Light Combat Helicopter: 

Continues below advertisement

తొలిసారి దేశీయంగా తయారైన హెలికాప్టర్లు..

రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆత్మనిర్భరత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తొలిసారి దేశీయంగా తయారైన Light Combat Helicopter (LCH)ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అందుబాటులోకి రానుంది. 
రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో అధికారికంగా IAFలోకి చేరుతుంది ఈ హెలికాప్టర్. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి నేతృత్వంలో గాల్లోకి ఎగురుతుంది. రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. "తొలిసారి దేశీయంగా తయారు చేసిన   Light Combat Helicopter ను అధికారికంగా వాయుదళంలోకి ఇండక్ట్ చేసే కార్యక్రమానికి హాజరవుతాను. ఇవి...మన దేశ వాయు దళానికి అదనపు బలం చేకూరుస్తాయి" అని ట్వీట్ చేశారు. క్షిపణులను, పలు ఆయుధాలను ప్రయోగించేందుకు ఈ హెలికాప్టర్ ఉపయోగపడనుంది. ఈ ఏడాది మార్చిలో 15 LCHలను తయారు చేసేందుకు రూ.3,887 కోట్లు కేటాయించింది భారత్. Limited Series Production (LSP)వీటిని డిజైన్ చేసింది. 

ఫీచర్లు ఇవే..

1. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైట్ కంబాట్ హెలికాప్టర్ల తయారీలో కీలక పాత్ర పోషించింది. 

2. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో వినియోగించేందుకు వీటిని తయారు చేశారు. గంటకు 268 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోతుంది. 

3. 5.8టన్నుల బరువున్న ఈ రెండు ఇంజిన్‌ల హెలికాప్టర్‌ను ఇప్పటికే పలు సార్లు పరీక్షించారు. 

4. Advanced Light Helicopter Dhruvకి, ఈ LCHకి కొన్ని పోలికలున్నాయి. ఆయుధ రక్షణా వ్యవస్థ, రాత్రి పూట కూడా దాడి చేయగలిగే సామర్థ్యం లాంటి ఫీచర్లున్నాయి. 

5. ఎత్తైన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేసే విధంగా దీన్నితయారు చేశారు. కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ (CSAR),శత్రు రక్షణా వ్యవస్థను పటాపంచలు చేసే DEAD ఫీచర్‌ కూడా ఉంది. 

6. దట్టమైన అడవుల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకునే అవకాశముంటుంది. 

7. గ్లాస్‌ కాక్‌పిట్, కంపొజిట్ ఎయిర్‌ఫ్రేమ్ స్ట్రక్చర్ లాంటి అదనపు ఫీచర్లున్నాయి. దాదాపు 10 హెలికాప్టర్లను IAFకి అధికారికంగా అందిస్తారు. మిగతా 5 హెలికాప్టర్లు ఇండియన్ ఆర్మీకి అందజేస్తారు. 

Also Read: KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Also Read: Congress Presidential Poll: 'పోటీ వద్దని చెప్పినా థరూర్ వినలేదు- చర్చకు నేను ఒప్పుకోను'

Continues below advertisement