Where did writing begin:
  


అక్షరాలు రాసేప్పుడు ఎప్పుడైనా...వాటి పుట్టుక ఎక్కడ మొదలైందో ఆలోచించారా..? మొట్టమొదటి అక్షరం ఎవరు రాశారు..? ఏ భాషలో..అని ఆరా తీశారా..? ఇప్పుడంటే మనకు పెన్నులు, పెన్సిళ్లు..ఇలా రకరకాల సాధనాలొచ్చేశాయి. మరి అప్పట్లో ఎలా రాసేవారో తెలుసుకున్నారా..? మనం రాస్తున్నాం, చదువుతున్నాం అంటే..కచ్చితంగా ఈ చరిత్రంతా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే...మన అక్షరాస్యతే (Litearcy) మన మనుగడకు కారణమవుతోంది కాబట్టి. హిస్టరీలోకి వెళ్తే...దీనికి సంబంధించిన ప్రస్తావన ఎంతో కనిపిస్తుంది. ఆ చరిత్రేంటో మనమూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Also Read: Ocean's Color: సముద్రం రంగులు ఎందుకు మారతాయి? దీని వెనకాల ఏమైనా మిస్టరీ ఉందా?


రాయడం మొదలైంది అప్పుడే..


చరిత్రలో ఎన్నో నాగరికతలున్నాయి. ఒక్కో సివిలైజేషన్‌లో ఒక్కో విధంగా మనిషి జీవనశైలి మారుతూ వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు గడిచాక..ఇదుగో ఇప్పటి ఆధునిక నాగరికతను అనుభవిస్తున్నాం. ఈ జర్నీలోనే...అక్షరాలు పుట్టాయి. 3000BCలోనే "రాయడం" అనే ప్రక్రియ మొదలైంది. దీన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? మెసొపొటేమియా(Mesopotamia)లోని సుమేరియన్లు (Sumerians).ఇప్పటికీ దక్షిణ ఇరాక్‌లో ఈ తెగకు చెందిన వాళ్లున్నారు. అప్పటి పాలనలో భాగంగానే రాయడం అనే ప్రాసెస్‌ను మొదలు పెట్టారు సుమేరియన్లు. ప్రజలకు నిత్యావసరాలు పంచి పెట్టినప్పుడు, సరుకులు నిల్వ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఓ లెక్కా పత్రం ఉండేది కాదు. మన దగ్గర ఎంత పాడి ఉంది..? ఎన్ని సరుకులు గోదాముల్లో ఉన్నాయి..? అని గుర్తు పెట్టుకోవడం వాళ్లకు కష్టతరంగా మారింది. అప్పుడే వారి బుర్రలో బల్బు వెలిగింది. ఈ లెక్కలన్నీ రాతపూర్వకంగా పెట్టుకుంటే...రోజూ గుర్తు పెట్టుకోవాల్సిన పని ఉండదు కదా అని అనుకున్నారు. అందుకే...పెద్ద పెద్ద బండరాళ్లు తెచ్చుకుని వాటిపై సరుకుల వివరాలను నమోదు చేసే వారు. అదెలా అంటే...ఫోటోల రూపంలో. వీటినే Pictographs అంటారు. ఈ కింద ఇచ్చిన ఇమేజ్‌ను ఓ సారి పరిశీలించండి.




(Image Credits: Khanacademy)


దక్షిణ ఇరాక్‌లో దొరికిన ఈ శిలాఫలకం...అప్పటి "రైటింగ్" (Origins of Writing) ప్రాసెస్‌ను మన కళ్లకు కడుతుంది. ఇందులో మనకు అంతా స్పష్టంగా కనబడకపోయినా....హిస్టారియన్లు మాత్రం ఈ స్టోన్‌పై ఏమున్నాయో వివరిస్తున్నారు. అప్పట్లో ఒళ్లొంచి పని చేసిన వారికి శక్తినిచ్చేందుకు రోజువారీ రేషన్‌లో భాగంగా బీర్(Beer)ని అందించేవారట. గోడౌన్‌లో ఇంకెంత బీర్ మిగిలింది అని గుర్తించేందుకు ఇలా శిలలపైనే రాళ్లతో చెక్కుకునే వారు. ఈ ఫోటోలో డౌన్ యారో సింబల్‌ కనిపిస్తోంది కదా. అదే అప్పట్లో బీర్‌ సింబల్. సుమేరియన్లు కనిపెట్టడం వల్ల దీనికి "Sumerian Writing" అనే పేరు స్థిరపడిపోయింది. ఓ పదునైన టూల్‌తో శిలలపైఇలా చెక్కేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఎప్పుడైతే ఇలా చెక్కడం మొదలు పెట్టారో..అప్పటి నుంచి వారికి ఇది చాలా సింపుల్‌ ప్రాసెస్ అనిపించింది. అందుకే...మట్టిలోనూ, శిలలపైనా..ఇలా ఎక్కడ పడితే అక్కడ సింబల్స్‌ని గీయడం మొదలు పెట్టారు. క్రమక్రమంగా అది వారి జీవనశైలిలో భాగమైంది. 


మిడిల్ ఈస్ట్‌లో ఎక్కువగా..


ఈ సిల్లబిక్ రైటింగ్ సిస్టమ్ (Syllabic writing system)నే Cuneiform అని పిలుస్తారు. మిడిల్‌ ఈస్ట్‌లో ఎక్కువగా కనిపిస్తుందిది. కాంస్యయుగం తొలినాళ్ల వరకూ ఇది కొనసాగింది. కామన్ ఎరా (Common Era) మొదలయ్యేంత వరకూ చాలా విరివిగా ఈ రైటింగ్‌ ప్రాసెస్‌ను ఫాలో అయ్యారు అప్పటి ప్రజలు. దీన్నే "Wedge Shaped Marks"గా పిలుస్తారు. అంటే...చాలా షార్ప్‌గా చెక్కడం అన్నమాట. దాదాపు 600 సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. ఆ తరవాత క్రమంగా...ఇది సింప్లిఫై అయింది. ఈ క్యూనిఫామ్ సింబల్స్‌ అన్నింటినీ ఒక్క చోట చేర్చటం మొదలైంది. 
వాటిని చూస్తూ...పలకడం మొదలు పెట్టారు. అంటే...కొన్ని సింబల్స్‌ను పక్కన పక్కన పెట్టి వాటిని కలిపి చదవడం మొదలైంది. అదే...భాషగా మారింది. కమ్యూనికేషన్‌కు నాంది పలికింది. అప్పటి నుంచి మనసులో అనుకున్నది ఎక్స్‌ప్రెస్ చేయడం లేదా రాసి చూపించటం మొదలు పెట్టారు. మరో స్పెషాల్టీ ఏంటంటే...అప్పటి ప్రజలకు కేవలం కమ్యూనికేషన్‌తోనే ఆగిపోకుండా...ఇదే సిల్లబిక్ రైటింగ్‌ సిస్టమ్‌లో కథలూ రాశారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 15 భాషలు రాసేవారట. సుమేరియన్, అకాడియన్, బేబిలోనియన్, అసీరియన్,పర్షియన్...ఇలా ఎన్నో. ఈ క్యూనీఫామ్‌ నుంచే ఈజిప్టియన్లు కొత్త సిల్లబిక్ సిస్టమ్‌ను కనిపెట్టారని హిస్టారియన్లు చెబుతారు. దాని పేరు హీరోగ్లిఫిక్స్ (Heiroglyphics). ఈజిప్ట్‌లోని కొన్ని చారిత్రక కట్టడాలపై దీన్ని మనం చూడొచ్చు.


ఇండస్ స్క్రిప్ట్


సింధూ నాగరికత సమయంలోనూ సింధూ ప్రజలూ Pictographs స్క్రిప్ట్‌ను రాసేవారు. దీన్నే Indus Scriptగా పిలుస్తారు. కాకపోతే..దీనికి సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా లభించాయి. మొత్తం 5 గుర్తులు మాత్రమే ఎక్కువగా దొరికాయి. అందుకే దీన్ని మిస్టీరియస్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్‌ అని హిస్టారియన్లు అంటారు. అర్థమైందా కాలేదా అన్నది పక్కన పెడితే...భారత ఉపఖండంలో మొట్టమొదటి Writing Form మాత్రం ఇదే. ఈ సింబల్స్‌ నుంచే...బ్రహ్మీ, దేవనాగరి, బెంగాలీ స్క్రిప్ట్‌లు పుట్టుకొచ్చాయని వాదించే వాళ్లెందరున్నారో...లేదు అని చెప్పేవాళ్లూ అంతే మంది ఉన్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా..."రాయడం" అనే ప్రక్రియ మొదలైంది సుమేరియన్ నాగరికతలో అని మాత్రం హిస్టరీ పరిశీలిస్తే అర్థమవుతోంది.