Hindu Temple Australia Threat:
గాయత్రి మందిరానికి బెదిరింపులు..
ఆస్ట్రేలియాలోని ఓ ఆలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవాలంటే "ఖలిస్థాన్ జిందాబాద్" అని నినాదాలు చేయాలని హెచ్చరించారు ఆగంతకులు. వేడుకలు ప్రశాంతంగా జరగాలంటే ఈ స్లోగన్స్ ఇవ్వాల్సిందేనని బెదిరించారు.
బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిరానికి ఈ కాల్స్ వచ్చాయి. గతంలోనూ ఆస్ట్రేలియాలో పలు హిందూ ఆలయాలపై దాడి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొందరు ఇలాగే కాల్స్ చేసి బెదిరించారు. ముఖ్యంగా విక్టోరియా ప్రావిన్స్‌లోని హిందూ ఆలయాలపై దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఆలయ గోడలపై అసభ్యకరంగా రాయడం అలజడి సృష్టించింది. ఆస్ట్రేలియా టుడే చెప్పిన వివరాక ప్రకారం..గాయత్రి మందిర్ అధ్యక్షుడు జై రామ్, ఉపాధ్యక్షుడు ధర్మేశ్ ప్రసాద్‌కు కాల్స్ చేసి బెదిరించాడో వ్యక్తి,. అంతే కాదు తన పేరు
గురువదేశ్ సింగ్ అని కూడా చెప్పాడు. హిందువులంతా ఖలిస్థాన్‌కు మద్దతుగా ఉండాల్సిందేనని చెప్పాడు. ఆలయానికి వచ్చిన వాళ్లందరూ ఖలిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయాలని అని డిమాండ్ చేశాడు. అటు మెల్‌బోర్న్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. ఓ ఆలయ పూజారికి కాల్ చేసిన ఖలిస్థాన్ మద్దతు దారులు బెదిరించారు. ఆలయం మూసేయాలని, పూజలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
అయోధ్య రామ మందిరాన్ని పేల్చే కుట్ర జరిగే ప్రమాదముందని ఇటీవలే నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ హెచ్చరికలతో పోలీసులూ అలెర్ట్ అయ్యారు. భారీ భద్రత నడుమ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి స్థలాన్ని పూర్తిగా పేల్చి వేస్తామంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పడం సంచలనమవుతోంది. ఓ స్థానికుడికి గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి రామ జన్మభూమి స్థలాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. ఉదయం ఈ పని పూర్తి చేస్తామని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసినట్టు స్థానికుడు పోలీసులకు వివరించాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్‌లనూ అప్రమత్తం చేశారు. రామ జన్మభూమి కాంప్లెక్స్ వద్ద పహారా ఇంకాస్త పెంచారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ చేసిన ఆగంతుకుడు ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి.