Mahashivratri 2023: శివలింగానికి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే!

శివుడు అభిషేక ప్రియుడని ప్రతి భక్తుడికీ తెలుసు. నీటితో, పంచామృతాలతో, పుష్పాలతో, విభూదితో ఇలా రకరకాల అభిషేకాలు చేస్తుంటారు. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా...

Continues below advertisement

Mahashivratri 2023:  విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది.  ఏ ద్రవ్యంతో  అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో వివరించారు పండితులు.....

Continues below advertisement

Also Read: లింగాష్టకంలో ప్రతి పదం వెనుక ఇంత అర్థం ఉందా!

ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం
ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది
భస్మ జలం  - పాపాలు నశిస్తాయి 
సుగంధోదకం - పుత్ర లాభం 
పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
సువర్ణ జలం - దరిద్ర నాశనం
అన్నాభిషేకం  - సుఖ జీవనం
ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం  - శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి 
ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం 
నవరత్న జలం - గృహ ప్రాప్తి
మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
విభూది  - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

Also Read: స్త్రీ-పురుషులు సమానం అని ఇప్పుడు చెప్పడం ఏంటి - శివుడు అప్పుడే చెప్పాడు

మహశివరాత్రి రోజు జాగరణ అంటే ఊరికే మేల్కొని ఉండడం కాదు...భగవంతుడి అస్తిత్వంలో మనసు లగ్నమై ఉండటమే జాగరణ. భగవంతుడిని తలుచుకుంటూ మేల్కొని ఉండాలి కానీ భౌతికంగా మేల్కొని ఉంటూ ఏవేవో కాలక్షేపాలు చేయడం కాదు. రాత్రిపూట శివుడు లింగోద్భవం అయ్యాడు కాబట్టి..పగలంతా ఆయన రాకకోసం వేచిచూస్తూ..పరమేశ్వరుడు ఆవిర్భవించగానే భక్తితో అర్చించేందుకే ఉపవాసం, జాగరణ చేస్తారు

బిల్వాష్టకమ్

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

Continues below advertisement
Sponsored Links by Taboola