వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్ షో వివాదాస్పదం అవుతోంది. ఆయన షో తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే మునావర్ ఫారుఖీ షోను హైదరాబాద్‌లో జరగనివ్వబోమని హిందూ సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. హిందూ వ్యతిరేక భావనలతో ఆయన కామెడీ చేస్తూంటారని.. కించ పరుస్తూంటారని వారు ఆరోపిస్తున్నారు. అందుకే షోను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని చెబుతున్నారు.
Also Read: ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లకు కేటీఆర్ ఆఫర్ ! బెంగళూరు గాలి తీసేశారుగా !?
మునావర్ ఫారుఖీ షోలు ఎక్కడిక్కడ రద్దు అవుతూ వస్తున్నాయి. కొద్ది రోజుల కిందట బెంగళూరులో ఆయన షోను రద్దు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హిందూ సంఘాలు హెచ్చరించడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు షోకు ఇచ్చిన అనుమతిని క్యాన్సిల్ చేశారు. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ ... ఓ కార్యక్రమంలో ఈ అంశంపై స్పందించారు. మునావర్ ఫారుఖీ హైదరాబాద్ వచ్చి "షో" చేయాలని ఆహ్వానించారు. తాము కామెడీని సీరియస్‌గా తీసుకోబోమని.. "షో"లకు ఇచ్చిన పర్మిషన్లను రద్దు చేయబోమన్నారు.
Also Read: పెద్దల్ని ఎదిరించిన పెళ్లి చేసుకున్న లవర్స్.. ఉప్పెన సినిమా చూపించిన పేరెంట్స్..
కేటీఆర్ ఆహ్వానం ధైర్యం ఇచ్చిందేమో కానీ మునావర్ ఫారుఖీ వెంటనే హైదరాబాద్‌లో షోను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఈవెంట్ టిక్కెట్లను కూడా అమ్మడం ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆయన షో వివాదాస్పదం అవుతోంది. ఇతర నగరాల్లో అడ్డుకున్నట్లుగానే తాము అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి మునావర్ ఫారుఖీతో పాటు కునాల్ కమ్రా అనే మరో స్టాండప్ కమెడియన్ ను కూడా బీజేపీ నేతలు.. హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారి షోలు జరగడం లేదు.
అయితే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో మాత్రం వారికి రక్షణ లభిస్తోంది. ముంబై, కోల్ కతా వంటి చోట్ల వారు తమ స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వారికి భద్రత కల్పించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా ఆహ్వానం పలకడంతో హైదరాబాద్‌లోనూ వారి షో నిరాటంకంగా సాగే అవకాశం ఉంది. హిందూ సంఘాలు హెచ్చరించినా.. పోలీసులు రక్షణ కల్పిస్తే షో జరగడం పెద్ద విషయం కాదని భావిస్తున్నారు.
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి