" బెంగళూరు మెట్రోలిపాలిటన్ నగరమని చెప్పుకుంటారు... అయితే అక్కడ కామెడీని మరీ ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? నాకు అర్థం కావడంలేదు ?" తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెడీని సీరియస్‌గా తీసుకోవడం అనే పదం సెటైరిక్‌గా ఉండటమే కాదు.. ఆయన వ్యాఖ్యానించినది కూడా ఇద్దరు ప్రముఖ స్టాండప్ కమెడియన్లకు ఎదురైన అనుభవాల గురించి. ఆ ఇద్దరి కామెడి పొలిటికల్‌గా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. అందుకే కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ ఆ ఇద్దరు స్టాండప్ కమెడియన్లను హైదరాబాద్‌లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఓపెన్‌గా ఆహ్వానించారు.
Also Read: యూపీలో ఐటీ దాడుల కలకలం.. అఖిలేష్ సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు !
హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ప్రముఖ స్టాండప్ కమెడియన్స్ కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలను హైదరాబాద్‌లో ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో మీ ప్రదర్శనలు క్యాన్సిల్ అయ్యే చాన్సే లేదని వారికి హామీ ఇచ్చారు. ఇలా ఎందుకు అన్నారంటే ఇటీవలి కాలంలో వారిద్దరి ప్రదర్శనలు ఇవ్వాలనుకున్న చోటల్లా అనుమతి నిరాకరిస్తున్నారు. బెంగళూరులో ఇటీవల కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీల ప్రదర్శలను అక్కడి పోలీసులు అనుమతించలేదు. అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ అవకాశాన్ని కేటీఆర్ వదులుకోలేదు.
హైదరాబాద్ ట్రూలీ కాస్మోపాలిటన్ సిటీ అని.. కేటీఆర్ చెప్పే క్రమంలో..బెంగళూరులో పరిస్థితిని సెటైరిక్‌గా వివరించారు. రాజకీయంగా వ్యతిరేక భావాలున్నంత మాత్రాన వారి ప్రదర్శనలను తాము అడ్డుకోబోమన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రతీ రోజూ ఎన్నో విమర్శలు చేస్తూంటాయని కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా సహనంగా ఉంటామన్నారు. దరాబాద్ వచ్చి ప్రదర్శనలు ఇచ్చినా.. తమపై సెటైర్లు వేసినా తాము స్పోర్టివ్‌గానే తీసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Also Read: కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి.... హర్షం వ్యక్తం చేసిన అదర్ పునావాలా
కునాల్ కమ్రా, మునావర్ ఫారుఖీలు .. బీజేపీ ప్రభుత్వాన్ని.. విధానాలను తీవ్రంగా విమర్శిస్తీ.. స్టాండప్ కామెడీ చేస్తూంటారు. వారికి మంచి ఫాలోయింగ్ ఉంది.. కానీ వారిని బీజేపీ నేతలు సహజంగానే వ్యతిరేకిస్తూంటారు. ఈక్రమంలో వారి షోలను ఎక్కడిక్కక్కడ రద్దు చేయిస్తూ ఉంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసలు జరగవు. ఇప్పుడు వారిని కేటీఆర్ ఆహ్వానించారు. కేటీఆర్ ఆహ్వానంపై స్టాండప్ కమెడియన్లు ఇంకా స్పందించలేదు.
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి