తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కొల్లగొట్టిన వ్యవహారంలో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు అకాడమీ నిధులు రూ. 60 కోట్లకుపైగా గల్లంతయినట్లుగా గుర్తించారు. తెలుగు అకాడమీ వివిధ బ్యాంకుల్లో దాదాపుగా రూ. 330 కోట్లను ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా చేసింది. వీటిలో నుండి యూనియన్ బ్యాంక్ కార్వాన్ శాఖ నుండి రూ. 43 కోట్లు, సంతోష్ నగర్ శాఖ నుండి రూ. 8కోట్లు. చందానగర్ కెనరా బ్యాంక్ శాఖ నుండి రూ. 9 కోట్లు గల్లంతయినట్లుగా గుర్తించారు. ఇప్పటికే కార్వాన్, సంతోషనగర్ యూనియన్ బ్యాంకు శాఖలపై ఫిర్యాదు చేశారు. తాజాగా చందానగర్ కెనరా బ్యాంక్‌పైనా ఫిర్యాదు చేశారు.
యూనియన్ బ్యాంక్ మేనేజర్ అరెస్ట్ !
తెలుగు అకాడమీ నిధుల గల్లంతులో బ్యాంక్ అధికారులతో పాటు అధికారులు కూడా కుమ్మక్కయ్యారని భావిస్తున్నారు. సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీఎస్ పోలీసులు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్‌వలితో పాటు మరొకర్ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. మాయమైన నిధులు ఎక్కడికి తరలించారు.. అన్న అంశాన్ని బయటకు తీస్తున్నారు. నిధులను రికవరీ చేసేందుకు చర్యలు ప్రారంభించారు. అకాడమీలోని ప్రధానంగా ముగ్గురు ఉద్యోగులపై అనుమానాలు ఉన్నాయి. వారిని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది పాత్రపై అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు మాత్రం తమకేమీ సంబంధం లేదని అంటున్నారు. సరైన పత్రాలు చూశాకే డిపాజిట్ క్లోజ్ చేశామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?
ఏపీకి నిధులు పంచాల్సి రావడంతో వెలుగులోకి లెక్కలు !
హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది. ఉమ్మడి ఆస్తుల జాబితాలో తెలుగు అకాడమీ ఉంది. జనాభా ప్రాతిపదికన ఆస్తులను పంచాలన సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్ల రూపాయల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ. 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది. అక్టోబర్ ఒకటో తేదీకి బదిలీ చేయాల్సి ఉన్నందున ఆ ప్రక్రియ ప్రారంభించారు. అప్పుడే ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతయ్యాయని తేలింది.
Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
ఉన్నతాధికారులకు తెలియకుండా నిధుల బదలాయింపు సాధ్యమేనా ?
ఇంత భారీ ఎత్తున నగదు బదిలీ జరుగుతూంటే ఉన్నతాధికారులకు తెలియకుండా ఉంటుందా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంస్థలాగే తెలుగు అకాడమీ ఆర్థిక వ్యవహారాలను చూసే విభాగం ఉంది. నిరంతరంగా లెక్కలను సరి చూసుకుంటూ ఉంటారు. చిన్నతేడా వచ్చినా గుర్తిస్తారు. అలాంటిది వరుసగా కోట్ల రూపాయలు దారి మళ్లిస్తున్నా.. ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ స్కాం మొత్తం వ్యవస్థీకృతంగా జరిగిందని బ్యాంక్ అధికారుల కన్నా ఎక్కువగా తెలుగు అకాడమీకి చెందిన ారి ప్రమేయమే ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నరా.ు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే అసలు స్కాం ఎక్కడ జరిగిందో నిందితులు ఎవరో తేలే అవకాశం ఉంది.