Heroin Seized In Mumbai: మహారాష్ట్రలో భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు పోలీసులు. 22 టన్నుల డ్రగ్స్ కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది
ముంబయిలోని నవశేవ పోర్ట్‌లో పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల హెరాయిన్‌ను పట్టుకున్నట్లు సమాచారం. ఈ హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1,725 కోట్లుగా అధికారులు తెలిపారు.
దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. లికోరస్ అనే మొక్కలకు హెరాయిన్ కోటింగ్ వేసి డ్రగ్స్ తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తరలింపునకు, అక్రమ రవాణాకు ఈ మధ్య వినూత్న పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల
బంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇటీవల భారీ డ్రగ్ రాకెట్ బయటపడింది. దాదాపు రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్ ఈ ఆపరేషన్‌లో లభ్యమైంది. గుజరాత్ పోలీసుల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. కోల్‌కతాలో రూ. 200 కోట్ల విలువైన హెరాయిన్‌ను ఈ టీం స్వాధీనం చేసుకుంది. కోల్‌కతా పోర్టుకు స్క్రాప్ కంటైనర్‌లో 40 కిలోల డ్రగ్స్‌ను తీసుకొచ్చారు. ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
" ఓ చెత్త కంటైనర్‌లో భారీగా డ్రగ్స్ తీసుకు వెళ్తున్నట్లు మాకు సమాచారం అందింది. దీంతో గుజరాత్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. రూ.200 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడింది. నిందితులను అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. "
Also Read: SC Constitution Bench: ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం!