'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం ఆయన విజయవాడ కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని.. ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగా అధికార యంత్రాంగం పని చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
విపత్తు వేళ అమానవీయం - వరదల్లో బోట్ల యజమానుల దందా, తరలించేందుకు అధిక డబ్బులు వసూలు!
ఏపీలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. విజయవాడ (Vijayawada) పూర్తిగా నీట మునిగింది. ఇళ్లు నీట మునిగిపోగా బాధితులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. బోట్ల ద్వారా బాధితులకు ఆహారం అందించడం సహా పూర్తిగా నీరు ఉన్న చోట బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా కొందరు ప్రైవేట్ బోటు యజమానులు అమానవీయంగా ప్రవరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వరద బాధితల కోసం నిధులు విడుదల చేసిన రేవంత్- సాయం ఐదు లక్షలకు పెంపు
తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, రైల్వే పట్టాలు కొట్టుకుపోయాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా చాలా పల్లెల్లు నీటిలో కాపురాలు చేస్తున్నాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ వర్షాలకు ఖమ్మం జిల్లాలో భారీ నష్టం జరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - 432 రైళ్లు రద్దు, మరికొన్ని సర్వీసులు దారి మళ్లింపు
తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఆదివారం నుంచి ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వే 432 రైళ్లు రద్దు చేయగా.. 140 రైళ్లను దారి మళ్లించింది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. అటు, తెలంగాణలో వర్షాలు, వరద ఉద్ధృతితో పలుచోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బెజవాడ దుఃఖదాయని బుడమేరు వరదలకు కారణమేంటీ? మానవ తప్పిదమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?
మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వయనాడ్ బీభత్సం తెలియజేస్తే లేటెస్ట్‌గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రశాయి. ముఖ్యంగా విజయవాడ సిటీ మధ్యలో ప్రవహించే బుడమేరు అనే చిన్న నది (నిజానికి నది అని పిలిచినా ఇది ఒక పెద్ద సైజు కాలువ అని చెప్పుకోవచ్చు) ఈరోజు నాలుగు జిల్లాల ప్రజలను బెంబేలెత్తిస్తోంది. విజయవాడ సిటీ అయితే రెండు రోజులుగా నిద్ర పోవడం లేదు. సగానికిపైనే నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి