Trains Cancelled Due To Hevay Rains: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఆదివారం నుంచి ఇప్పటివరకూ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 432 రైళ్లు రద్దు చేయగా.. 140 రైళ్లను దారి మళ్లించింది. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రద్దైన వాటిలో పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. అటు, తెలంగాణలో వర్షాలు, వరద ఉద్ధృతితో పలుచోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. వరంగల్ - మహబూబాబాద్‌లో ట్రాక్స్ ధ్వంసమయ్యాయి. దీంతో సోమవారం ఉదయం 96 రైళ్లు రద్దు చేశారు. అటు, మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువుకట్ట తెగి.. విజయవాడ - కాజీపేట మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్స్ ధ్వంసమైన చోట యుద్ధ ప్రాతిపదికన అధికారులు పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. 


రద్దైన రైళ్ల వివరాలు





























ముమ్మరంగా పునరుద్ధరణ పనులు


అటు, తెలంగాణలో వరద ఉద్ధృతితో కొన్ని చోట్ల రహదారులు, రైల్వే ట్రాక్స్ ధ్వంసమయ్యాయి. సరిహద్దు వద్ద పాలేరు నదికి వరద పోటెత్తి వంతెన తెగిపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. అటు, కేసముద్రం మండలంలోని ఇంటికన్నె - కేసముద్రం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ శనివారం రాత్రి కొట్టుకుపోగా.. పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగించేలా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రత్యేక రైళ్లల్లో కాజీపేట నుంచి ఇసుక బస్తాలు, సిమెంట్, కంకర తెప్పిస్తున్నారు. రాత్రి, పగలు దాదాపు 300 మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సాయంతో పనులు సాగిస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే సోమవారం పనులు పూర్తి చేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను మళ్లీ ప్రారంభించే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ద.మ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


అటు, తెలంగాణలోని కీలకమైన హైదరాబాద్ - విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండగా.. టీజీఎస్ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది. రద్దైన వాటిలో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కి పైగా బస్సులున్నాయి.


Also Read: CM Chandrababu: 'సహాయక చర్యలు ఎక్కడా ఆగకూడదు' - వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష, జోరు వర్షంలోనూ మరోసారి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన