ఈ రోజుల్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) లాంటి నాయకుడు రావాలని, ప్రజలకు కావాలని పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'ఎక్స్' (సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్)లో పేర్కొన్నారు. అద్భుతాలు జరగాలని, అది పవన్ మాత్రమే చేయగలరని, చేస్తారనే నమ్మకం తనతో పాటు ఆంధ్ర ప్రజలు అందరికీ ఉందని ఆయన తెలిపారు. తన తమ్ముడు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన శుభాకాంక్షలు చెప్పారు.
పవన్... ఈ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం!
ప్రతి ఏడాది పుట్టిన రోజు కంటే ఈ ఏడాది పవన్ పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం అని చిరు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తొలి పుట్టిన రోజు కదా! ''ఆంధ్ర ప్రజానీకానికి కావాల్సిన సమయంలో... కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన నాయకుడిగా నిన్ను (పవన్ కల్యాణ్) వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Also Read: మేమంతా ఓ కుటుంబం... ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి - బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు
బాబాయ్‌కు అబ్బాయ్ పుట్టినరోజు శుభాకాంక్షలు!
''మీ బలం, మీ అంకితభావం, అవసరంలో ఉన్నవారి పట్ల మీరు చూపించే కనికరం ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిని ఇచ్చాయి. అలాగే, నాతో పాటు చాలా మందికి! మీరు చేసే నిస్వార్థ సేవ, మీ నాయకత్వం, సామాజిక న్యాయం కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరు చూపే అంకితభావం ఆంధ్రలోని అణగారిన వర్గాల జీవితాల మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మీ కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం'' అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. బాబాయ్ అని కాకుండా పవన్ కల్యాన్ గారూ అని ఆయన బర్త్ డే విషెష్ తెలియజేయడం గమనార్హం. ఏపీ డిప్యూటీ సీఎం గనుక ఆ విధంగా ఆయన ట్వీట్ చేశారని అనుకోవాలి.