కప్పుడు తెలుగు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ హీరోను వరుస ప్లాప్స్‌ వెంటాడాయి. దీంతో అతడు సినిమాలకు దూరంగా అయ్యాడు. అయితే సినిమాలకు నువ్వు దూరం అయ్యావా? లేక సినిమానే నీకు దూరం అయ్యిందా అని అడిగితే.. తానేప్పుడు సినిమాకు దూరం అవ్వాలనుకోలేదన్నాడు. వరుస ప్లాప్స్‌ కెరీర్‌ కుదిపేయడంతో ఒత్తిడికి గురయ్యాడట. ఇక ఇంట్లోనే నుంచి అసలు బయటకు రాలేదంటున్నాడు ఈ హీరో. అప్పుడు రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని, కానీ కుటుంబం సపోర్ట్‌తో ఆ మానసిక ఒత్తిడి నుంచి అధిగమించానన్నాడు ఈ హీరో.  ఆయన ఎవరో కాదు లాహిరీ లాహిరి లాహిరీ ఫేం ఆదిత్య ఓం. 


తొలి చిత్రంతోనే ఎంతో ఫేం సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యాక్ట్‌ చేశాడు. హీరోగానే కాకుండా విలన్‌గానూ తన టాలెంట్‌ చూపించాడు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోగా గుర్తింపు పొందిన అతడు సడెన్‌గా   కనుమరుగయ్యాడు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమలు చేస్తున్న అవేవి పెద్దగా ఆదరణ పొందలేదు. దీంతో కాస్తా గ్యాప్‌ తీసుకుని దర్శకుడిగా రీఎంట్రీ ఇచ్చాడు. సొంతంగా కథ రాసుకుని సినిమా తెరకెక్కించాడు. అలా ముంబై వెళ్లి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా మళ్లీ కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు. ఇక సినిమాలు తెరకెక్కిస్తు దర్శకుడిగా,నిర్మాతగా సక్సెస్‌ అందుకున్నాడు. 


నిర్మాత బాగా సంపాదిస్తున్న ఆదిత్య అందులో కొంత డబ్బు సామాజికి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తాడట. ఇక శ్రీమంతుడు సినిమాల్లో మహేష్‌ బాబులా ఆదిత్య మూడు గ్రామాలను దత్తత తీసుకుని రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. అవే భద్రాద్రి కొత్తగూడెంలోని మూడు గ్రామాలను దత్తత తీసుకుని దాదాపు 500 మందికి సాయం చేశాడు. అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాలకు అంబులెన్స్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. సేవాగుణం మెండుగా ఉన్న ఆదిత్య బిగ్‌బాస్‌ షోతో మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కాలని చూస్తున్నాడు. బిగ్‌బాస్‌ తనకు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లాంటిదన్నాడు. హౌజ్‌లో తనకు లిమిట్‌లెస్‌గా ఛాలెంజ్‌లు కావాలన్నాడు. మరి అన్ని సవాళ్లు ఎదుర్కొని ఈ శ్రీమంతుడు బిగ్‌బాస్‌ టైటిల్‌ కొడతాడో లేదో చూడాలి!