Bigg Boss Telugu 8 Contestant Bezawada Bebakka: ఈసారి బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ సరికొత్త థీమ్‌తో అలరించేందుకు రెడీ అయ్యింది. ఈసారి కంటెస్టెంట్స్‌గా హీరోహీరోయిన్లు, టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్, సోషల్ మీడియా స్టార్స్ కామన్ మ్యాన్ సెన్సేషనల్ పర్సనాలిటీని హౌజ్‌లో దింపుతున్నారు. వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్, నటి బెజవాడ బేబక్క కూడా ఉంది. కరోనా టైంలో తన రీల్స్‌తో బాగా వైరల్ అయిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ క్రేజ్ ఉంది.
రీల్స్‌తో ఫేమస్...
ఎప్పుడూ తన వీడియోలు, రీల్స్‌తో (Bezawada Bebakka Reels and Videos) నెటిజన్లను ఆకట్టుకుంటుంది. జనరల్ కంటెంట్‌పైనే ఫన్నీ వీడియోలు తీస్తూ పాపులారిటీ సంపాదించుకుంది. చిత్తూరు స్లాగ్‌లో మాట్లాడుతూ అలరిస్తుంది. బెజవాడ బేబక్కగా ఎంతో ఫేమస్సైన ఆమె అసలు పేరు 'మధూ సింగర్ నెక్కంటి'. మొన్నటి వరకు అమెరికాలో ఉన్న ఆమె ఈ మధ్యే ఇండియాకు వచ్చింది. కరోనా టైంలో మంచు లక్ష్మిపై రీల్స్ చేసి వైరల్ అయ్యింది. అలా గుర్తింపు పొందిన ఈ బేబక్క సినీనటి అనే విషయం తెలుా? ఆమె తెలుగులో పలు సినిమాల్లో నటించారట. అంతేకాదు హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్‌గా కూడా నటించింది.
సినిమాల్లోనూ
బెజవాడ బేబక్క.. సోషల్ మీడియా ఇన్‌ప్లూయేన్స్, యూట్యూబ్ స్టార్‌గానే అందరికి తెలుస. కానీ ఆమె నటి, సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. యూఎస్ పౌరసత్వం ఉన్న ఆమె 6 నెలల క్రితం ఇండియాకు వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే వీడియో, సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీతో ఆమెకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనకు బంధువని స్వయంగా ఆమె ఓ ఇంటర్య్వూలో చెప్పింది. బేబక్క తెలుగులో "అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి", "24 కిసెస్", "మళ్లీ పెళ్లి" వంటి చిత్రాల్లో నటించారు. అలా దాదాపు ఆమె 20 సినిమాల వరకు చేసినట్టు ఓ ఇంటర్య్వూలో తెలిపింది.
Also Read: బిగ్‌బాస్ 'శ్రీమంతుడు' ఆదిత్య ఓం గురించి ఈ విషయాలు తెలుసా?
Shoot-Out At Alair శ్రీకాంత్ భార్యగా...
అలాగే ఇటీవల హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ "షూట్-అవుట్ ఎట్ అలేర్"(Shoot-Out At Alair) సినిమాలో శ్రీకాంత్ భార్యగా నటించారు. అలా కొన్ని సిగ్నిఫికెంట్ చిత్రాలు చేసినా పెద్దగా లైమ్‌లైట్లోకి రాలేదు. కానీ, తన ఇన్‌స్టా రీల్స్‌తో మాత్రం ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 164k ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడూ తన రీల్స్, వీడియోలతో అలరించిన ఈ బేజవాడ బేబక్క నేటి నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతుంది. మరి హౌజ్ చలాకీ మాటలు, చిత్తూరు స్లాగ్‌తో ఆడియన్స్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.