Bigg Boss 8 Telugu Season Promo: ఈసారి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బిగ్‌బాస్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలను బిగ్‌బాస్ షో గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది బిగ్‌బాస్ టీం. ప్రోమో మొత్తం ట్విస్ట్‌లతో సాగింది. కంటెస్టెంట్స్‌ని చూపించకుండ వారి వాయిస్‌తో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచారు. ఇక హీరో నాని, హీరోయిన్ ప్రియాంక మోహన్, రానా, నివేదా థామస్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సందడి చేశారు.
రాజ్ తరుణ్-లావణ్య కేసులో సంచలనంగా మారిన ఆర్జే శేఖర్ భాషా కూడా ఈసారి హౌజ్‌లోకి రాబోతున్నాడు. వచ్చిరాగనే తన వాటం చూపించారు. బిగ్‌బాస్ మిగతా కంటెస్టెంట్స్ సవాలు విసిరాడు. నన్ను శత్రువులా చూస్తే టైటిల్ పట్టుకుపోతానంటూ మిగితా కంటెస్టెంట్‌కి అప్పడే వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. దీంతో శేఖర్ భాష తీరు చూస్తుంటే హౌజ్‌లో అతడి రచ్చ మామూలుగా ఉండదంటున్నారు. ముందే తనతో జాగ్రత్త అంటూ శేఖర్ భాషా వార్నింగ్ తీరు చూస్తుంటే హౌజ్‌లో గొడవలు, వివాదాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయా అని అంతా అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తానికి సీజన్‌ను బిగ్‌బాస్ మామూలుగా ప్లాన్ చేయలేదు.
సోషల్ మీడియా, మీడియాల్లో సెన్సేషనలైన వారినే హౌజ్‌లో దింపుతున్నారు. మరి ఈ సీజన్ ఎంతగా ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి. బిగ్‌బాస్ హౌజ్‌ని ఈసారి భారీగా ప్లాన్ చేశారు. కంటెస్టెంట్స్ గ్రూప్స్‌గా డివైడ్ చేసి ఆ గ్రూప్‌లకు సపరేట్ రూమ్స్ ఇవ్వబోతున్నారట. అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి. కంటెస్టెంట్స్ ఆట తీరు, గెలిచని టాస్క్‌లు బట్టి ఎవరెవరిక ఎలాంటి రూం ఇస్తారనేది మున్ముముందు తెలియనుంది. ఈసారి మొత్తం హౌజ్‌ని యానిమల్ థీమ్‌తో డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
గతకొద్ది రోజులుగా యూట్యూబ్‌లో శేఖర్ భాషా పేరు మారుమోగుతుంది. లావణ్య, రాజ్ తరుణ్ కేసులో సంచలన విషయలు బయటపెడుతూ హాట్‌టాపిక్‌గా మారాడు. లావణ్యనే టార్గెట్ చేస్తూ ఆమె సీక్రెట్‌లని బట్టబయలు చేస్తూ కాంట్రవర్సల్ అయ్యాడు. ఇక లైవ్‌లో లావణ్యతో డిబెట్, ఆమె చెప్పుతో కొట్టడం.. ఇలా గత నెల రోజులుగా శేఖర్ భాషా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. అలాంటి శేఖర్ భాషా ఇక హౌజ్‌లోకి అడుగుపెడతే ఎలా ఉంటుందో మీ ఊహాకే వదిలేస్తున్నామంటూ అతడిని హౌజ్‌లోకి దింపుతుంది టీం.