నటుడు ఆదిత్య ఓం.. ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 80's, 90's వారికి మాత్రం ఈయన బాగా సుపరిచితం. డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు అతడు కేరాఫ్ అడ్రస్. లాహిరి లాహిరి లాహిరి, ధనలక్క్క్ష్మీ ఐ లవ్ యూ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. నటుడిగానే కాదు దర్శకుడిగా, రైటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఎన్నో సినిమాలు చేసిన ఆయన కెరీర్ సక్సెస్‌ఫుల్ సినిమాలు తక్కువే. అందుకే ఈ హీరో పెద్దగా లైమ్‌లైట్లోకి రాలేదు.
హీరో.. డైరెక్టర్.. రైటర్
అయినా కూడా నిరాశ పడకుండ తన ప్రయత్నం లోపం లేకుండ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటుడిగా బ్రేక్ తీసుకుని దర్శకత్వం చేస్తున్నారు. ఇటీవల 2024 'దహనం' మూవీని తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాదు ఫిల్మ్ ఫెస్టెవల్లో పలు అవార్డ్సు కూడా అందుకుంది. దర్శకుడిగా ఆదిత్య ఓంకి కూడా అవార్డు వరించాయి. ఈ సినిమా స్టోరీ ఆఫ్ భరత అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ మంచి విజయం అందుకున్నాడు.
హిందీ, ఇంగ్లీష్ లో కూడా...
ఆదిత్య ఓం మన తెలుగు వాడే. 1975 అక్టోబర్ 5న జన్మించాడు. ప్రస్తుతం ఆయన వయసు 48 ఏళ్లు. లాహిరి లాహిరి లాహిరి చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ధనలక్ష్మి ఐ లవ్ యూ, ఒట్టు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, మిస్టర్ లోన్లీ మిస్ లవ్లీ, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి వంటి సినిమాలు చేశాడు. తెలుగులోనే కాదు హిందీలో, ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు. అప్పట్లో నటుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయనను వరుస ప్లాప్స్ వెంటాడటంతో సినిమాలు తగ్గించి దర్శకత్వం బాధ్యతలు చేపట్టాడు. రీఎంట్రీలో తనే రైటర్‌గా, దర్శకుడిగా, హీరో సినిమాలు చేస్తున్నాడు.
మూడు గ్రామాల దత్తత
రీసెంట్‌గా బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. 'మాసాబా' అనే వెబ్ సిరీస్‌లో నటించి దర్శకత్వం వహించాడు. తెఈ వెబ్ సిరీస్‌గానూ ఆయన పలు ఫిల్మ్ ఫెస్టివల్ అవార్ట్స్ వచ్చాయి. ఈయన నటుడిగా, దర్శకుడిగా, రైటర్‌గా బాగా సంపాదిస్తున్న ఆయన సామాజిక సేవల్లోనూ యాక్టివ్‌గా ఉంటారు. దానధర్మాలు ఎక్కువగా చేస్తుంటారట. ఇప్పటికే ఎంతోమంది పేదలు, నిరాశ్రయులను ఆర్థికంగా ఆదుకుని అండగా నిలిచారు. అంతేకాదు ఆయన ఏకంగా మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఎంతోమంది స్పూర్తిగా నిలిచారు. అలాంటి ఆయన ఇప్పుడు బిగ్‌బాస్ హౌజ్‌లో అలరించేందుకు రెడీ అయ్యారు.