Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్ర ఇంటికి పంతుల్ని దేవయాని పిలిపిస్తుంది. మనీషా, మిత్రల పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పిలిచానని చెప్తుంది. మనీషా, మిత్రల జాతకాలు తీసుకు రమ్మని మనీషాకు దేవయాని పంపిస్తుంది. అందరూ హాల్లో కూర్చొంటారు. మనీషా పంతులికి జాతకాలు ఇస్తుంది. ఇక జాను లక్ష్మీ ఇంకా రాలేదని టెన్షన్ పడుతుంది. పంతులు మనీషా వాళ్ల జాతకాలు చూసి ఇద్దరి జాతకాల దృష్ట్యా రెండు నెలలు మంచి ముహూర్తాలు సెట్ అవ్వడం లేదని అంటాడు. మనీషా టెన్షన్ పడుతుంది. ఇక దేవయాని పెట్టుడు ముహూర్తం పెట్టమని అంటుంది.
అరవింద: అంత తొందర ఎందుకు దేవయాని రెండు నెలలు ఆగమని పంతులు చెప్తున్నారు.
పంతులు: నేను అలాంటి ముహూర్తాలు పెట్టనమ్మా కానీ మీరు ఏర్పాటు చేసుకుంటాను అంటే రేపే మంచి మూహూర్తం ఉంది. వారం పది రోజులు అని మీరు అన్నారు కాబట్టి రేపటి ముహూర్తం గురించి నేను చెప్పలేదు.
జయదేవ్: ఇది బొమ్మల పెళ్లి కాదు కదా ఏర్పాట్లు ఎలా అవుతాయి.
మిత్ర: అక్కర్లేదు పంతులు గారు రేపటి ముహూర్తం ఫిక్స్ చేయండి.
అరవింద: రేపే పెళ్లి ఏంట్రా ఎందుకు అంత తొందర పడుతున్నారు.
పంతులు: రేపు ముహూర్తం జాతకాలకు చక్కగా కుదిరింది. ఆ ముహూర్తంలో జరిగితే పెళ్లిని ఎవరూ ఆపలేరు.
దేవయాని లగ్నపత్రిక చదవమని పంతులుతో చెప్తుంది. ఇంతలో సంయుక్త కూడా వస్తుంది. దేవయాని సంయుక్తని పిలిచి తన దగ్గర కూర్చొపెట్టి మిత్ర, మనీషాల ముహూర్తం గురించి చెప్తుంది. సంయుక్త అలియాస్ లక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. రేపే పెళ్లి అని అందర్ని రెడీ అవ్వమని చెప్తుంది. ఇక దేవయాని, మనీషాలు బయటకు ఎందుకు వెళ్లారని అరవింద అడుగుతుంది. దానికి మనీషా లక్కీ లంచ్ బాక్స్ మర్చిపోవడంతో తీసుకెళ్లి ఇచ్చామని చెప్తుంది. మరోసారి మనీషా మాటలకు మిత్ర ఇంప్రెస్ అయిపోతాడు. ఇక స్కూల్లో జున్నుని తన ఫాదర్ గురించి అడుగుతున్నారని అయినా జున్ను చెప్పలేదని అంటుంది.
మనీషా: నాకు తెలిసి జున్ను మదర్‌కి అర్జున్‌కి ఎదైనా అఫైర్ ఉండొచ్చు. అందుకే జున్నుకి తన ఫాదర్ గురించి చెప్పలేదేమో.
జాను: మనీషా..
మనీషా: నేను ఎవర్నో అంటే నీకు కోపం వస్తుందేంటి .
వివేక్: తెలియని వారి గురించి ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది.
అరవింద: ఒకే ఇంట్లో ఉంటే అక్రమ సంబంధం అంటగట్టేస్తారా కాస్తా సంస్కారం నేర్చుకోండి.
దేవయాని: ఏంటి అందరూ జున్ను తల్లిని గురించి మాట్లాడుతున్నారు వాడి తండ్రి మీకు ఎవరో తెలిస్తే చెప్పండి.
మిత్ర: పిన్ని అవన్నీ ఎందుకు ముందు పెళ్లికి ఏం కావాలో అది చూడండి.
లక్ష్మీ ఏడుస్తుంటే అరవింద ఓదార్చుతుంది. ఇక ఉదయం పెళ్లి ఏర్పాట్లు వైభవంగా జరుగుతాయి. అరవింద మాత్రం బాధగా గతంలో మిత్ర, మనీషాల నిశ్చితార్థం రోజున జరిగిన ప్రమాదం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనీషాతో పెళ్లి జరిగితే మిత్ర ప్రాణాలకు ప్రమాదం అని గురువుగారు చెప్పిన మాటలు తలచుకొని ఏడుస్తుంది. జయదేవ్ అరవిందను ఓదార్చుతాడు. లక్ష్మీకి అన్యాయం జరగకూడదని కోరుకుంటారు. ఈ పెళ్లి ఆపగల శక్తి ఆ దేవుడికి లేదంటే లక్ష్మీకే ఉందని జయదేవ్ అనుకుంటాడు. ఇక మిత్ర కూడా పెళ్లికి రెడీ అయి తనంతట తాను నుదిటిన బాసిటం కట్టుకుంటాడు. అది సరిగా కట్టుకోలేకపోవడంతో సంయుక్త వచ్చి పట్టుకుంటుంది. ఆ స్పర్శకి మిత్ర లక్ష్మి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటాడు. సంయుక్త మిత్రకు బాసిటం కడుతుంది. మిత్ర అద్దంలో చూస్తూ ఉండిపోతాడు.
మిత్ర లక్ష్మీ అని పిలిస్తే లక్ష్మీ కూడా అలా ఉండిపోతుంది. ఎమోషనల్ అయిపోతుంది. సంయుక్త తాను లక్ష్మీ కాదని సంయుక్త అని అంటుంది. లక్ష్మీ ఇక్కడే ఉంటే ఈ పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. మిత్ర మాత్రం లక్ష్మీ తనని మోసం చేసిందని అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.