Independence Day Wishes :
స్వాతంత్య్ర దినోత్సవం వచ్చేస్తోంది. అందరి గుండెలు ఇప్పటికే దేశభక్తితో ఉప్పొంగిపోతున్నాయి. ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా ఎగురుతోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది తమ డీపీలుగా "త్రివర్ణ"పతాకాన్ని పెట్టుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌తో ఈ సారి వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. మరి మీరు చెప్పే విషెస్ కూడా ఇంతే ప్రత్యేకంగా ఉండాలి కదా. వాట్సాప్ స్టేటస్‌లలో పెట్టాలనుకున్నా, సోషల్ మీడియాలా షేర్ చేయాలన్నా..ఆ శుభాకాంక్షలు కాస్త భిన్నంగా ఉంటేనే బాగుంటుంది. ఈ కింద లిస్ట్‌లో ఇచ్చిన కోట్స్‌లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని మీ స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పండి.
⦿ దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండ దండా మనదే..
ఎన్ని బేధాలున్నా..
మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతం..
వందేమాతరం అందాం మనమందరం.
⦿ వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
మన స్వాతంత్ర్య దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..
భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.
- అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..
శాశ్వతం మువ్వన్నెల పతాకం..
చరితార్థం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం.. వందే మాతరం..
భారతీయతే మా నినాదం!
మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంబరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
⦿ అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
⦿ ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
“స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను దానిని తప్పక పొందుతాను" – బాలగంగాధర తిలక్
“నువ్వు నాకు నీ రక్తాన్ని ఇవ్వు, నేను కు నీకు స్వాతంత్య్రం ఇస్తా"- సుభాష్ చంద్ర బోస్
Also Read: Revolutionary Female Poets: మహిళా సమస్యలు, హక్కులపై నినదించిన రచయిత్రులు వీళ్లే