Hair Conditioner Fatal: ఉక్రెయిన్‌పై యుద్ధంలో అణుబాంబులు ఉపయోగించేందుకు కూడా వెనుకాడబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల హెచ్చరించారు. పుతిన్ హెచ్చరికల వేళ అమెరికా తన దేశ పౌరులకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అణుయుద్ధం జరిగినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను వెల్లడించింది.
అవి మాత్రం వద్దు
అణుయుద్ధం జరిగినప్పుడు మీ జుట్టుకు షాంపూలు, కండీషనర్‌లను ఉపయోగించవద్దని అమెరికా తన ప్రజలకు సూచించింది. సాధారణ రోజుల్లో షాంపూ, కండిషనర్లు జుట్టును రక్షిస్తాయి. కానీ అణు విస్ఫోటనం సంభవించినప్పుడు షాంపూలు, కండిషనర్లు జుట్టుకు రేడియోధార్మిక పదార్ధాల మధ్య జిగురుగా పని చేస్తాయని పేర్కొంది.
రేడియోధార్మిక పదార్థాలను ట్రాప్ చేసే అవకాశం ఉన్నందున షాంపూలు, కండీషనర్‌లను ఉపయోగించవద్దని ప్రజలకు అమెరికా ప్రభుత్వం సూచించింది.
రేడియేషన్‌ను నివారించడానికి మీ జుట్టుపై కండీషనర్లను ఉపయోగించకుండా ఉండాలని యూఎస్ సలహా ఇచ్చింది.
ఇలా చేయాలి
- అణుబాంబు పేలితే రేడియోధార్మిక ధూళి కణాలు గాలిలోకి వ్యాపిస్తే.. వీలైనంత త్వరగా స్నానం చేయాలని సలహా ఇచ్చింది.
- ఈ రేడియోధార్మిక కణాలు మనిషి కణాలను దెబ్బతీస్తాయని, అవి ప్రాణాంతకం కావచ్చని పేర్కొంది.
- అణు విస్ఫోటనం జరిగితే ప్రజలు రేడియేషన్‌ను నివారించడానికి ఇటుక లేదా కాంక్రీట్ భవనం లోపల ఆశ్రయం పొందాలని తెలిపింది.
- ప్రజలు తమ కళ్లు, ముక్కు నోటిని తాకకుండా ఉండాలని కూడా సూచించింది.
- అణువిస్పోటనం జరిగినపుడు ప్రజలు కలుషితమైన పాత దుస్తులను తొలగించి వెంటనే స్నానం చేయాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రజలకు సూచించింది.
రష్యా వార్నింగ్
ఉక్రెయిన్ యుద్ధం గురించి దేశ ప్రజలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు పుతిన్.
Also Read: Amit Shah Bihar Visit: 'నితీశ్‌ది వెన్నుపోటు రాజకీయం- 2024లో భాజపా తడాఖా చూపిస్తాం'