ABP  WhatsApp

Amit Shah Bihar Visit: 'నితీశ్‌ది వెన్నుపోటు రాజకీయం- 2024లో భాజపా తడాఖా చూపిస్తాం'

ABP Desam Updated at: 23 Sep 2022 02:44 PM (IST)
Edited By: Murali Krishna

Amit Shah Bihar Visit: బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై భాజపా అగ్ర నేత అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.

'నితీశ్‌ది వెన్నుపోటు రాజకీయం- 2024లో భాజపా తడాఖా చూపిస్తాం'

NEXT PREV

Amit Shah Bihar Visit: 2024 సార్వత్రిక ఎన్నికలకు భాజపా ఇప్పుడే ప్రచారం మొదలుపెట్టింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం పూర్నియాలో జరిగిన మెగా ర్యాలీలో ప్రసంగించారు. 'జన్ భావన మహాసభ' పేరుతో నిర్వహించిన ర్యాలీలో నితీశ్ కుమార్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.



నితీశ్ కుమార్.. భాజపాకు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీశ్ బాబు ప్రధాని కాగలరా? రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాలా మందికి నితీశ్ ద్రోహం చేశారు. లాలూ జీ, రేపు మిమ్మల్ని వదిలిపెట్టి నితీశ్ బాబు కాంగ్రెస్ ఒడిలో కూర్చుంటారు జాగ్రత్త!  2014లో మీకు (బిహార్ సీఎం నితీష్ కుమార్) కేవలం 2 లోక్‌సభ స్థానాలు మాత్రమే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు రానివ్వండి.. బిహార్ ప్రజలు.. లాలూ-నితీష్ ద్వయాన్ని తుడిచి పెట్టేస్తారు. 2025 ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో ఇక్కడ మేం అధికారంలోకి రాబోతున్నాం.                                              - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


నితీశ్ ప్రయత్నాలు


ఇటీవల భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.


ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు.  "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. 


ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.


మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. "


Published at: 23 Sep 2022 02:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.