Gyanvapi Mosque Case: 



హైకోర్టు తీర్పుని విభేదించిన సుప్రీం..


జ్ఞానవాపి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆ మసీదులోని శివలింగానికి కార్బన్ డేటింగ్‌తో పాటు సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుగా..సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సైంటిఫిక్ సర్వే జరపాలన్న హైకోర్టు తీర్పుతో విభేదించింది. దీనిపై స్టే విధించింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ వరకూ ఈ స్టే కొనసాగనుంది. నూతన సాంకేతికతను ఉపయోగించి శివలింగం ఎన్నాళ్ల క్రితందో తెలుసుకోవచ్చు. దీన్నే కార్బన్ డేటింగ్ అంటారు. దీనిపై అలహాబాద్ హైకోర్టు అంగీకరించినప్పటికీ..సుప్రీంకోర్టు మాత్రం ఒప్పుకోవడం లేదు. గతంలోనే వారణాసి హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందన్న వాదనలపై విచారణ జరిపి వీడియో సర్వే చేయాలని తేల్చి చెప్పింది. కానీ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌కి మాత్రం అంగీకరించలేదు. గతేడాది అక్టోబర్ 14న ఈ పిటిషన్‌ని పక్కన పెట్టింది వారణాసి కోర్టు. ఆ తరవాత ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. హిందూ, ముస్లిం సంఘాలు ఈ తీర్పులపై సవాలు పిటిషన్‌లు వేస్తూనే ఉన్నారు. అయితే..ప్రస్తుతం సుప్రీంకోర్టు మాత్రం ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అటు యూపీ ప్రభుత్వానికీ నోటీసులిచ్చింది. హైకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ ఆధారంగా ఈ నోటీసులు పంపింది. 










వరుస విచారణలు..


జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫిక్ సర్వే చేయగా అందులో శివలింగం బయటపడిందని హిందువులు చెబుతున్నారు. దీనిపై ముస్లింలు, హిందువుల మధ్య వాగ్వాదం కొనసాగుతూ వస్తోంది. చివరకు ఇది సుప్రీం కోర్టుకు చేరింది. హిందువుల పిటిషన్‌ను  పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం గతేడాది మే 17వ తేదీన సుప్రీం కోర్టు వారణాసి జిల్లా మెజిస్ట్రేట్‌కు కీలక ఆదేశాలిచ్చింది. మసీదులో ఉన్న శివలింగాన్ని కాపాడాల్సిన బాధ్యతను అప్పగించింది. అంతే కాదు. ముస్లింలు జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. అటు వారణాసి కోర్టులోనూ దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. మసీదులో ఉన్న శివలింగానికి పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కొందరుహిందువులు పిటిషన్ వేశారు. వారణాసి జిల్లా కోర్టు మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు పిటిషన్ వేయగా..దాన్ని కొట్టి వేసింది. ఇలా...వారణాసి కోర్టు, సుప్రీంకోర్టు మధ్య చాన్నాళ్లుగా ఈ వివాదం నలుగుతోంది. 


Also Read: Meta Layoffs: మెటాలో మరో రౌండ్ లేఆఫ్‌లు, ఈ సారి 6 వేల మందికి గుడ్‌బై!