Meta Layoffs: 


వచ్చే వారమే..


మెటాలో మరో రౌండ్ లేఆఫ్‌లు మొదలవనున్నాయి. కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్..ఇదే విషయాన్ని కన్‌ఫమ్ చేశారు. ఈ మధ్యే జరిగిన ఓ మీటింగ్‌లో ఎంప్లాయిస్‌కి ఈ చావు కబురు చల్లగా చెప్పారు. నిజానికి...ఇదేమంతా షాకింగ్‌గా అనిపించలేదు ఉద్యోగులకు. ఈ ఏడాది మే నెలలో మరో రౌండ్ లేఆఫ్‌లు తప్పవు అని గతంలోనే జుకర్‌ బర్గ్ స్పష్టం చేశారు. కాకపోతే..ఇప్పుడు అధికారికంగా ప్రకటించారంతే. కానీ...ఎంత మందిని తొలగిస్తున్నారని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం కొన్ని రిపోర్ట్‌ల ఆధారంగా చూస్తే...వేలాది మందిని తొలగించనుంది మెటా. కనీసం 6 వేల మందిని ఇంటికి పంపనుంది. వచ్చే వారంలో ఈ ప్రక్రియ మొదలవుతుందని సమాచారం. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 10 వేల మందిని తొలగించింది మెటా..ఈ సారి 6 వేల మందిని తీసేయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 4 వేల మందిని తొలగించింది. బిజినెస్‌ టీమ్స్‌లోనే ఎక్కువ సంఖ్యలో లేఆఫ్‌లు ఉంటాయని నిక్ క్లెగ్‌ సంకేతాలిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో లేఆఫ్‌ల మార్గం తప్ప మరేదీ కనిపించడం లేదని చెప్పారు. లేఆఫ్‌లు కాకుండా మరేదైనా ప్రత్యామ్నాయ దారులున్నాయా అని వెతికినట్టు వెల్లడించారు నిక్ క్లెగ్. ఏం చేయాలో అర్థం కాకే...ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వివరించారు. 


జుకర్‌పై ప్రశ్నల వర్షం..


కాస్ట్ కటింగ్‌లో భాగంగా తప్పడం లేదని సీఈవో జుకర్ బర్గ్ చెబుతున్నా ఆ కంపెనీపై అసహనం అయితే పెరుగుతోంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకూ జాబ్ గ్యారెంటీ లేకుండా పోతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఉద్యోగులతో మీటింగ్ పెట్టారు జుకర్‌బర్గ్. మార్చి 16న ఈ సమావేశం జరిగినట్టు The Washington Post వెల్లడించింది. అయితే...ఈ మీటింగ్‌లో ఉద్యోగులందరూ జుకర్‌బర్గ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. కంపెనీ పరిస్థితేంటి అని నేరుగానే ఉద్యోగులు జుకర్‌ను ప్రశ్నించారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అటు జుకర్ బర్గ్ మాత్రం కంపెనీ రీఆర్గనైజేషన్‌ గురించి మాట్లాడారట. వర్క్‌ఫ్రమ్ హోమ్ గురించి కూడా అడగ్గా...దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాధానమిచ్చారు జుకర్‌బర్గ్. ఉద్యోగులందరి పర్‌ఫార్మెన్స్‌పై రివ్యూ చేసిన కంపెనీ...కొందరికి చాలా తక్కువ రేటింగ్ ఇచ్చినట్టు సమాచారం. వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. Below Average అంటూ 7 వేల మందికి రేటింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాల్‌స్ట్రీట్ జనరల్ వెల్లడించిన వివరాలివి. ఇదే కాదు. రివ్యూ తరవాత బోనస్‌లు ఇవ్వడమూ ఆపేసింది. ఈ కారణంగానే...మళ్లీ భారీ లేఆఫ్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 


"జుకర్‌బర్గ్‌ను ఉద్యోగులు ఎన్నో ప్రశ్నలు వేశారు. ఈ కంపెనీని ఎలా నమ్మమంటారు అని ప్రశ్నించారు. ఇప్పటికే రెండు రౌండ్‌ల లేఆఫ్‌లు పూర్తయ్యాక...జాబ్ సెక్యూరిటీ పరిస్థితేంటని అడిగారు. అయితే అందుకు జుకర్‌బర్గ్ కూడా సమాధానం చెప్పారు. కేవలం పర్‌ఫార్మెన్స్ ఆధారంగానే లేఆఫ్‌లు చేపడుతున్నట్టు వివరించారు. ఎంప్లాయిస్ అందరూ తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. మనం పెట్టుకున్న ఏ మేరకు చేరుకుంటున్నాం అనే దానిపైనే ఈ లేఆఫ్‌లు ఉంటాయని చెప్పారు. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉందని అన్నారు. 


- వాషింగ్టన్ పోస్ట్ 


Also Read: Rahul Gandhi US Visit: అమెరికాలో రాహుల్ గాంధీ "లవ్ షాప్", త్వరలోనే ఓపెనింగ్